బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను కొమ్ములతో ఢీకొట్టిన దున్నపోతు.. పోలీసులు ఎవరిపై కేసు పెట్టారంటే..
ABN, First Publish Date - 2021-08-28T21:15:30+05:30
భార్యాభర్తలిద్దరూ బైక్‌పై వెళుతున్నారు.. అదే ఇరుకు రోడ్లో ముగ్గురు వ్యక్తులు తమ గేదెలను తీసుకువస్తున్నారు..
భార్యాభర్తలిద్దరూ బైక్‌పై వెళుతున్నారు.. అదే ఇరుకు రోడ్లో ముగ్గురు వ్యక్తులు తమ గేదెలను తీసుకువస్తున్నారు.. బైక్‌పై నెమ్మదిగా వెళ్తున్న వారి పైకి ఒక గేదె దూసుకెళ్లి తన కొమ్ములతో దాడి చేసింది.. ఈ ఘటనలో ఒక వ్యక్తికి చేతి వేళ్లు తెగిపోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు.. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన జరిగింది.
ఈ నెల 8వ తేదీ సాయంత్రం, జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి ఖడ్డా మార్కెట్ ప్రాంతంలో బైక్ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి తన గేదెలను తీసుకెళ్లున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గేదె బైక్‌పై వెళ్తున్న జుబైర్ దంపతులపై దాడి చేసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ బైక్ పైనుంచి పడిపోయారు. ఈ ఘటనలో జుబైర్ చేతి వేళ్లు విరిగిపోయాయి. అతని భార్యకు గాయాలయ్యాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. దానిని పరిశీలించి గేదెల యజమానులను అరెస్ట్ చేశారు. రద్దీ ప్రాంతంలోకి గేదెలను తీసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యరంటూ రజాక్, అతడి సోదరులు సదాకత్, నదాఫత్‌లను అరెస్ట్ చేశారు.
Updated Date - 2021-08-28T21:15:30+05:30 IST