ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్: ఎటు చూసినా సాలెగూళ్లే..నేలపై దుప్పటిలా పరుచుకుని..

ABN, First Publish Date - 2021-06-16T03:03:16+05:30

ఎవరైనా వీధిలో కెళ్లి నిలబడి ఓ మారు నలువైపులా పరికిస్తే.. నేలపై పరిచిన తెల్లని దుప్పటిని తలపించేలా సాలెగూళ్లు కనిపిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా వీధిలో కెళ్లి నిలబడి ఓ మారు నలువైపులా పరికిస్తే.. నేలపై పరిచిన తెల్లని దుప్పటిని తలపించేలా సాలెగూళ్లు కనిపిస్తాయి. కాస్తంత భయస్థులెవరైనా ఉంటే ఈ సీన్ చూసి గజగజ వణికిపోకతప్పదు. వీధులే కాదు.. పొలాలు, చెట్లు, ఖాళీ జాగాలు.. ఇలా ఎక్కడ చూసినా తెల్లటి సాలిగూళ్లు దుప్పటిలా పరుచుకుని కనిపిస్తాయి! ఇదేమీ హారర్ సినిమాలో దృశ్యం కాదు..పీడ కలం అంతకంటే కాదు..! ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో గల గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఇటీవల కాలంలో అక్కడ కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో..అక్కడి సాలేపురుగులు నీటిని తప్పించుకునేందుకు ఎత్తున ఉన్న ప్రాంతాలకు తమ మకాం మార్చేశాయని నిపుణులు చెబుతున్నారు. అయితే..ఈ సాలీళ్లతో ప్రమాదం ఏమీ లేదని, లోతట్టు ప్రాంతాల్లోని పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక..ఈ సాలెగూళ్ల బెడద కూడా తగ్గిపోతుందని వారు భరోసా ఇస్తున్నారు. అయితే.. ఆ ప్రాంతంలోని సాలెగూళ్ల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-06-16T03:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising