ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. కోర్టుల చుట్టూ తిరగాల్సిందే.. సూర్యకు వార్నింగ్

ABN, First Publish Date - 2021-07-05T17:14:22+05:30

తమిళ సినీ హీరోలకు, భారతీయ జనతా పార్టీకి మధ్య మాటల యుద్ధం ఎప్పట్నుంచో జరుగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ సినీ హీరోలకు, భారతీయ జనతా పార్టీకి మధ్య మాటల యుద్ధం ఎప్పట్నుంచో జరుగుతోంది. తమిళ ప్రముఖ హీరోలు విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బీజేపీ విభాగం గతంలో వాగ్వాదాలకు దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని సూర్య ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే తాజా సినిమాటోగ్రఫీ బిల్లుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో సూర్యపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. 


తమిళనాడు బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం తాజాగా ఒక సమావేశం నిర్వహించింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు. సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని, ఇతర విషయాలపై అనవసర జోక్యం, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. సూర్య ఇదే రీతీలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి, ఈ హెచ్చరికలకు సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.  

Updated Date - 2021-07-05T17:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising