ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bipin Rawat.. బయో వార్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన మరుసటి రోజే దారుణ ఘటన..!

ABN, First Publish Date - 2021-12-08T23:00:07+05:30

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలీకాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త.. దేశంలో ఒక్కసారిగా సంచలనం కలిగించింది. ఈ దారుణ ఘటన జరగకముందు మంగళవారం న్యూఢిల్లీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలీకాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త.. దేశంలో ఒక్కసారిగా సంచలనం కలిగించింది. ఈ దారుణ ఘటన జరగకముందు మంగళవారం న్యూఢిల్లీలో బయోవార్‌పై ప్రసంగించారు. కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి బయో వార్ అంశం హాట్ టాపిక్ అయింది. విపత్తు నిర్వాహణకు సంబంధించిన అంశంపై పూనేలో డిసెంబరు 20 నుంచి 22వరకు భారత్‌తో పాటూ వివిధ దేశాల ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది.


ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఫానెక్స్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లో ఉందని చెప్పారు. కరోనాతో బయోవార్‌ ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్‌ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఈ సమావేశంలో పాల్గొన్న బిపిన్ రావత్.. అనంతరం సతీమణి మధులిక రావత్, అధికారులతో కలిసి హెలీకాప్టర్‌లో తమిళనాడు వెళ్తుండగా కూనూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 13మంది మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బిపిన్ రావత్ సతీమణి, పలువురు అధికారులు మృతి చెందడంపై దేశమంతా విషాధ చాయలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదంపై అధికారుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


దేశంలోకి చొరబడే శత్రువులను దెబ్బకొట్టడానికి వ్యూహాలు రచించడంలో బిపిన్ రావత్ ఎంతో చురుగ్గా వ్యవహరించేవారు. ఆయనుకున్న ముందుచూపే.. అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిందనండంలో అతిశయోక్తి లేదు. ఈయర ఉత్తర్‌ఖండ్‌ రాష్ట్రంలో జన్మించారు. బిపిన్ రావత్ తండ్రి.. లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో రిటైర్‌ అయ్యారు. 1978లో తన తండ్రి పని చేసిన గుర్ఖా రైఫిల్స్‌లో సైనికుడిగా చేరాడు. పర్వతాలపై యుద్ధం చేయడంలో ఆయన ఆరితేరారని చెప్పొచ్చు. 2020 జనవరి 1న ఆయన త్రివిధ దళలాకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2021-12-08T23:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising