ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తకు విడాకులిచ్చి పుట్టింట్లో ఉంటున్న మహిళ.. గర్భం దాల్చడంతో నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. నిలదీస్తే ఆమె చెప్పింది విని..

ABN, First Publish Date - 2021-12-23T18:58:17+05:30

ఆమె భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటోంది.. ఆ సమయంలో పిన్ని కొడుకు ఆమెకు సన్నిహితంగా మారాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటోంది.. ఆ సమయంలో పిన్ని కొడుకు ఆమెకు సన్నిహితంగా మారాడు.. ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు.. అతడు ఆమెకు వరసకు సోదరుడు కావడంతో ఎవరూ అనుమానించలేదు.. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.. ఆ స్నేహం శారీరక సంబంధానికి దారి తీసింది.. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది.. విషయం బయటపడడంతో ఆ యువకుడు ఆమెకు మొహం చాటేశాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ముంగేర్‌కు చెందిన బాధిత మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింటికి చేరింది. ఆ సమయంలో వరసకు తమ్ముడయ్యే వ్యక్తితో ఆమెకు స్నేహం కుదిరింది. ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు. దీంతో అతడితో ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. ఫలితంగా గర్భం దాల్చింది. ఆ విషయం తెలియడంతో అతడు ఆమెకు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో ఆ మహిళ తన గర్భం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు షాకయ్యారు. వరసకు సోదరుడయ్యే వ్యక్తితో పెళ్లి ఎలా? అని నిలదీశారు. 


చివరకు నిందితుడి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి అడిగారు. అతడి కుటుంబం పెళ్లికి నిరాకరించడంతో బాధిత మహిళ బుధవారం ముంగేర్ మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు గురించి విని మొదట పోలీసులు కూడా షాకయ్యారు. సోదరుడిని పెళ్లి చేసుకుంటానని మహిళ చెబుతుండడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.  



Updated Date - 2021-12-23T18:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising