ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50లక్షలు విలువైన ప్రశ్న.. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా..

ABN, First Publish Date - 2021-10-30T02:41:02+05:30

బాలీవుడ్ మెగాస్టార్.. అమితాబ్ బచ్చన్.. వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రామ్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ షో 12 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 13 సీజన్ కూడా దూసుకుపోతూ.. సత్తా చాటుతోంది. విజయవంతంగా నడుస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొని, డబ్బులు గెలుచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్.. అమితాబ్ బచ్చన్.. వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రామ్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ షో 12 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 13 సీజన్ కూడా దూసుకుపోతూ.. సత్తా చాటుతోంది. విజయవంతంగా నడుస్తున్న ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొని, డబ్బులు గెలుచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ అది కొందరికే సాధ్యం అవుతుంది. ఈ క్రమంలోనే కుమార్ సౌరవ్ అనే వ్యక్తి తన ప్రతిభతో గురువారం రోజు హాట్ సీట్ వరకూ వెళ్లారు. అయితే ఓ ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోవడంతో అతడు రూ.50లక్షలను మిస్ అయ్యాడు. ఇంతకూ ఆ ప్రశ్న ఏంటి అనే వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన కుమార్ సౌరవ్ (30) హాట్ సీట్ వరకూ వెళ్లారు. ఆ తర్వాత రెండు లైఫ్‌లైన్‌లను వాడుకుని.. రూ.12.5లక్షల గెలుచుకున్నారు. అనంతరం మరో లైఫ్‌ల‌ైన్‌ను వాడుకుని.. రూ.25లక్షలను గెలిచారు. ఈ క్రమంలోనే రూ.50లక్షల ప్రశ్నకు ఆయన చేరుకున్నారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో.. గేమ్‌ నుంచి క్విట్ అయ్యారు. కాగా.. కుమార్ సౌరవ్ ఎదుర్కొన్న రూ.50లక్షల విలువైన ఆ ప్రశ్న ఏంటంటే.. 


ప్రశ్న: చంద్రుడిపై అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడు ఎవరు?

జవాబు: చార్లెస్ డ్యూక్ (Charles Duke)




Updated Date - 2021-10-30T02:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising