ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చెత్తకుప్పలపై Bangaloreans కన్నుపడింది

ABN, First Publish Date - 2021-11-05T23:14:20+05:30

ఒకప్పుడు చెత్త డంపింగ్ గ్రౌండ్ అయిన ఆ ప్రదేశం ఇప్పుడు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వద్దనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు:చెత్తతో నిండిపోయి దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోయేలా ఉండే నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వద్దనున్న ఆ స్థలం ఇప్పుడు సోమసుందరాయపాలయ చెరువు బఫర్ జోన్‌గా మారిపోయింది. త్వరలోనే అది చిన్నపాటి అడవిగా మారిపోనుంది. ఒకప్పుడు మొక్కలతో దట్టంగా ఉన్న ఆ ప్రాంతం తిరిగి పచ్చదనం సంతరించుకోనుంది. దాని పేరు ఇప్పుడు ‘సుందరవన’. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా స్థానికులు తలాకొంత వేసుకుని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ స్థలం నుంచి తొలగించారు.


 కర్నాటక కంపోస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేసీడీసీ) పక్కనే ఉన్న ఈ భూమిని చెత్తను కుమ్మరించేందుకు వాడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ భూమిని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఆధ్వర్యంలోని చెరువుల విభాగానికి అప్పగించింది.


 సిటిజెన్ గ్రూప్.. కమ్యూనిటీ టాస్క్ ఫోర్స్ (సీటీఎఫ్) జులైలో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడం, మొక్కలు నాటడం ప్రారంభించింది. ఈ నెల 5వ తేదీ నాటికి ఈ కార్యక్రమం ప్రారంభమై 112వ రోజుకు చేరుకుంది. స్థానికులు రోజూ ఉదయాన్నే అక్కడికి వచ్చి పని ప్రారంభిస్తారు. కామేష్ రస్తోగి, రమాకాంత్ నర్గుడ్, లలితాంబ బీవీ, వెంకటేశ్ హెచ్‌హెచ్‌ కలిసి సీటీఎఫ్‌ను స్థాపించారు.


ఇక్కడ నాటుతున్న మొక్కలను బీబీఎంపీ నిర్వహిస్తున్న నర్సరీ నుంచి తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ. 9-10 లక్షలు అవుతుందని అంచనా వేస్తుండగా, ఇప్పటి వరకు రూ. 2 లక్షల వరకు సేకరించారు. మిగతా నిధులను కూడా సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సీటీఎఫ్ వ్యవస్థాపకులు తెలిపారు. 

Updated Date - 2021-11-05T23:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising