ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో అద్భుతం.. 459 అడుగుల ఎత్తులో.. వంగిపోయిన అద్దం వంతెన.. ఫొటోలు వైరల్!

ABN, First Publish Date - 2021-03-28T12:37:00+05:30

చైనాలో మరో అద్భుతం సృష్టించారు. అత్యంత ఎత్తయిన గాజు వంతెన కట్టిన చైనా ఇంజనీర్లు ఈ సారి మరో ప్రయోగం చేశారు. కొంచెం కొత్తగా ఆలోచించి వంగిన వంతెనను సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనాలో మరో అద్భుతం సృష్టించారు. అత్యంత ఎత్తయిన గాజు వంతెన కట్టిన చైనా ఇంజనీర్లు ఈ సారి మరో ప్రయోగం చేశారు. కొంచెం కొత్తగా ఆలోచించి వంగిన వంతెనను సృష్టించారు. 140 మీటర్లు అంటే 459 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. 100 మీటర్ల పొడవైన ఈ గాజు వంతెన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.  చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో కట్టిన ఈ బ్రిడ్జిని ఇటీవలే చైనా ప్రభుత్వం ఓపెన్ చేసింది. 2017లోనే ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


అయితే ఇప్పటి వరకూ దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీన్ని స్థానికులు ‘బెండింగ్ బ్రిడ్జి’ అని పిలుచుకుంటున్నారు. దీన్ని చూడటానికి, దీనిపై షికారు చేయడానికి పర్యాటకులు ఎగబడుతున్నారు. ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా మారిందనడంలో సందేహమేమీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలామంది నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీన్ని సందర్శించాలనే కోరిక వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-03-28T12:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising