ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదానీ గ్రూప్ వంట నూనెలకు గంగూలీ గుండెపోటు సెగ

ABN, First Publish Date - 2021-01-06T17:23:17+05:30

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గుండెపోటు అదానీ సంస్థకు కొత్తసమస్యలు తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌’కు దాదా బ్యాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే దీనికి కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గుండెపోటు అదానీ సంస్థకు కొత్తసమస్యలు తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌’కు దాదా బ్యాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే దీనికి కారణం. ఆ కంపెనీ యాడ్‌లో ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు అంటూ గంగూలీ చెబుతారు. అలాంటి వ్యక్తి నేడు గుండెపోటుకు గురికావడంతో ఆ యాడ్ తీవ్ర విమర్శల పాలైంది.   


ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ ఆయిల్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. అదానీ కంపెనీ ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్రాండ్ అంబాసిడర్‌కే గుండె పోటని కామెంట్ల వర్షం కురిసింది. దీంతో అదానీ గ్రూప్ అప్రమత్తమైంది. చాలా తెలివిగా ఆ ప్రకటనను నిలిపివేసింది. అంతేగాక దాదా ఉన్న అన్ని ప్రకటనలను ఆపేసింది. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక.. ఆయనతో మాట్లాడి కొనసాగిస్తామని, ఇది తాత్కాలి విరామం మాత్రమేనని అదానీ గ్రూప్ తెలిపింది. 


సినీ, క్రీడాకారులతో ఎక్కువగా ప్రకటనలు చేసే కంపెనీలు.. వాటి ఆధారంగా అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయని, అయితే ఈ యాడ్స్ ఎంత ఫాల్స్ అన్నది... దాదా ఘటనతో మరోసారి రుజువైందని కామెంట్లు వినపడుతున్నాయి. 

Updated Date - 2021-01-06T17:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising