ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నేనాటోవాణ్ణి... ఆటోవాణ్ణి... వీడియో వైరల్... నెటిజన్లు ఫిదా!

ABN, First Publish Date - 2021-03-09T17:09:39+05:30

మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఒక ఆటో డ్రైవర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఒక ఆటో డ్రైవర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా కాంబ్లే అనే ఈ ఆటో డ్రైవర్ పెద్ద పెద్ద స్టెప్పులను సైతం సింపుల్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వివరాల్లోకి వెళితే బాబా కాంబ్లేతో పాటు అతని స్నేహితులు మాలెగావ్‌లోని ఒక పెట్రోల్ బంక్‌నకు వచ్చారు. అయితే వారు వచ్చిన సమయంలో విద్యుత్ లేనందున పెట్రోల్ కొట్టించుకునేందుకు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 


ఈ సమయంలో బాబా కాంబ్లే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. తోటి స్నేహితులు అతనికి ఉత్సాహాన్నివ్వడంతో బాబా కాంబ్లీ డాన్స్ ఇరగదీశాడు. అక్కడున్నవారు తమ సెల్‌ఫోన్‌లలో దీనిని చిత్రీకరించుకున్నారు. ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కాంబ్లే తెగ మురిసిపోయాడు. అంతేకాకుండా అతని డ్యాన్స్ చూసిన కొందరు సెలబ్రిటీలు ఫోన్‌చేసి అతనిని అభినందిస్తున్నారు. బారామతి తాలూకాలోని గున్వాడికి చెందిన బాబా కాంబ్లే గ్రామ పంచాయతీ సభ్యునిగానూ వ్యవహరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ను ఇష్టపడే ఆయన వివిధ నృత్య రీతులను నేర్చుకున్నాడు. అయితే సరైన అవకాశాలు అందక, ఆటోనడుపుతూ పొట్ట పోషించుకుంటున్నాడు. ఒక్క రాత్రిలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో బాబా కాంబ్లే ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. 

Updated Date - 2021-03-09T17:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising