ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్యంలోనే ఆమెకు వివాహం.. అనుకోని రీతిలో భర్త ఎడబాటు.. తిరిగి భర్తను అలా చూసేసరికి..

ABN, First Publish Date - 2021-12-18T18:03:24+05:30

భజరంగ్ సింగ్ తన 19 ఏళ్ల వయసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భజరంగ్ సింగ్ తన 19 ఏళ్ల వయసులో 1971లో బారత్-పాక్ యుధ్దంలో అమరుడయ్యాడు. అంతకుముందు అతనికి శ్యామావతి(13)తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత భార్యాభర్తలు ఏనాడూ కలుసుకోలేదు. శ్యామావతి అత్తవారింటికి వెళ్లేముందే.. భజరంగ్ సింగ్ 1971లో జరిగిన భారత్-పాక్ యుధ్దంలో ప్రాణాలు కోల్పోయాడు. పాక్ సైన్యం విసిరిన బాంబు భజరంగ్ సింగ్ దగ్గరున్న యుద్ధ ట్యాంకుపై పడింది. ఈ ఘటనలో భజరంగ్ సింగ్ అమరుడయ్యాడు. ఆ తరువాత అతని పార్థివ దేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. అప్పుడు తొలిసారిగా శ్యామావతి త్రివర్ణ పతాకం కప్పివుంచిన భర్త మృతదేహాన్ని చూసింది. ఈ పరిస్థితిలో భర్తను చూడగానే ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఆ తరువాత ఆమె మరో వివాహం చేసుకోలేదు.


ప్రస్తుతం రాజస్థాన్‌లోని బెహ్రార్‌లో ఉంటున్న ఆమెను విజయ్ దివస్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె నాటి అనుభవాన్ని మీడియాకు తెలిపారు. భజరంగ్ సింగ్ మృతిచెందాడనే సమాచారాన్ని అధికారులు తనకు తెలియజేసి, గ్రామానికి రప్పించారన్నారు. భర్త మృతదేహాన్ని త్రివర్ణ పతాకంతో కప్పివుండగా చూశానన్నారు. తాను భర్తను చూసింది అదే మొదటిసారి, చివరిసారని అన్నారు. ఆ తరువాత భర్త జ్ఞాపకాలతోనే జీవితాన్ని గడిపేశానని, మరో వివాహం చేసుకోలేదని తెలిపారు. తన బాధ్యతలను తన సోదరి చూసుకున్నదని, ఇప్పుడు ఆమె కుమారులు తనను చూసుకుంటున్నారని శ్యామావతి తెలిపింది.



Updated Date - 2021-12-18T18:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising