ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ మంచులో వృద్ధురాలు... సైనికులు ఎలా కాపాడారంటే...

ABN, First Publish Date - 2021-01-10T14:02:33+05:30

మన సైనికులు దేశ రక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న విషయం విదితమే. ఇంతేకాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: మన సైనికులు దేశ రక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న విషయం విదితమే. ఇంతేకాదు వారు ఆపదల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ఎప్పుడూ ముందుంటారు. జమ్ముకశ్మీర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలిని సైనికులు ఆదుకున్న తీరు చూస్తే ఎవరైనా సరే శభాష్ అనకతప్పదు. కశ్మీర్‌లోని బాందీపురాలో 74 ఏళ్ల వృద్ధురాలిని జవానులు 8 కిలో మీటర్ల దూరం వరకూ తమ భుజాలపై మోస్తూ, జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కశ్మీర్‌లో విపరీతంగా మంచుకురుస్తున్న కారణంగా ఆ వృద్ధురాలు బుథు గ్రామంలో చిక్కుకుపోయింది. 


ఈ నేపధ్యంలో ఆమె భర్త బుథు ఆర్మీ క్యాంప్‌కు ఫోన్ చేసి, తన భార్యను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరారు. వీరి ఇల్లు జిల్లా ఆసుపత్రికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో బుథుకు చెందిన జవానులు వెంటనే వారి ఇంటికి చేరుకుని, ఆ వృద్ధురాలిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి, ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కాగా ఆ వృద్దురాలు తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతోంది. భారీ మంచు మధ్య ఆ జవానులు వృద్ధురాలిని 8 కిలో మీటర్ల దూరం వరకూ తమ భుజాలపై మోసుకుని ప్రధాన రహదారి వరకూ తీసుకువెళ్లారు. తరువాత వాహనంలోకి ఎక్కించి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2021-01-10T14:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising