ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలాలు.. ఒకటి తర్వాత మరొకటి?.. నాసా కూడా తేల్చిసింది

ABN, First Publish Date - 2021-08-13T10:24:13+05:30

భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టనుంది. దాదాపు 500 మీటర్ల వ్యాసం కలిగిన బెన్ను అనే ఓ భారీ శకలం భూమి మరికొన్నేళ్లలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టనుంది. దాదాపు 500 మీటర్ల వ్యాసం కలిగిన బెన్ను అనే ఓ భారీ శకలం భూమి మరికొన్నేళ్లలో ఢీకొంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కచ్చితంగా చెబుతోంది. ఈ గ్రహశకలం ప్రతి 436.604 రోజులకు ఒకసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అలాగే ప్రతి 6ఏళ్లకు భూమికి చేరువగా వస్తోంది. ఈ క్రమంలోనే 2200లో ఈ బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా తొలుత వెల్లడించింది. ఈ బెన్ను గ్రహశకలం కదలికలపై ఐదేళ్లుగా నాసా పరిశోధన చేస్తోంది. అందులో భాగంగానే బెన్నుపై మరింత పరిశోధనలు జరిపేందుకు 2016లో ఒసైరిస్-రెక్స్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2020 అక్టోబర్‌ 21న ఒసైరిస్-రెక్స్ విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఆ గ్రహశకలంపై ఉన్న నమూనాలను సేకరించి.. దాని కదలికల్ని అంచనా వేస్తూ సమచారాన్ని నాసాకు అందిస్తోంది.


తాజాగా ఒసైరిస్-రెక్స్ అందించిన కీలక విషయాల ఆధారంగా 2300లో ఈ గ్రహశకలం భూమని ఢీకొంటుంని ప్రకటించింది. బెన్ను గ్రహశకలం భూమికి సుమారు 29.3 కోట్ల కి.మీ. దూరంలో ఉందని, ఇది భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరంతో సమానమని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహశకలం నుంచి ఒసైరిస్ రెక్స్ సేకరించిన నమూనాల వివరాలు 2023 నాటికి భూమికి చేరుకుంటాయని, అప్పుడు మరింత స్పష్టంగా సమాచారం తెలుస్తుందని వారంటున్నారు.


ఇదిలా ఉంటే మరికొంత మంది శాస్త్రవేత్తలు బెన్ను గ్రహశకలం వరకు అవసరం లేదని, అంతకుముందే మానవాళిని తుడిచిపెట్టేసే మరో గ్రహశకలం ‘అపోఫిస్’ భూమి వైపుగా దూసుకొస్తోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2068 లో ఈ అపోపిస్ గ్రహశకలం భూమికి అతి చేరువగా వస్తుందని, ఢీకొట్టే అవకాశాలు కూడా అత్యంత ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. యార్కోవ్‌స్కీ ఎఫెక్ట్ ప్రయోగం ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-08-13T10:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising