ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు కళ్లజోళ్ల వేలానికి ముహూర్తం ఫిక్స్.. ధర రూ.25 కోట్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

ABN, First Publish Date - 2021-09-17T03:17:27+05:30

రెండు కళ్లజోళ్ల వేలానికి ముహుర్తం ఫిక్స్..వీటి ప్రత్యేకత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పై ఫొటోను చూశారుగా.. ఇక్కడ ఉన్న రెండు కళ్లజోళ్లూ చూడటానికి బొమ్మల్లాగా కనిపిస్తున్నప్పటికీ వీటిని వేలం వేస్తే ఏకంగా రూ. 25 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంత ధర..? ఏమిటీ వాటి ప్రత్యేకత అంటారా..? ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. వీటిని సాక్షాత్తూ ముఘల్ రాజకుటుంబీకులు వాడారు. 17వ శతాబ్దంలో వీటిని తయారు చేశారట. ఈ కళ్లద్దాల ఫ్రేమ్‌లో పచ్చ, వజ్రాలను అమర్చారు. అంతేకాదు..ఓ కళ్లజోడులోని తెల్లటి లెన్సును గోల్కొండలో వెలికి తీసిన 200 క్యారెట్ల వజ్రం నుంచి తయారు చేశారు. రెండో దానిలోని లెన్సులను ఎమరాల్డ్(పచ్చ)తో తయారు చేశారు. 

ఇవీ చదవండి:
బాధ్యత మర్చిపోయిన యువకుడికి భారీ షాకిచ్చిన కలెక్టర్


బాలుడి అకౌంట్లో రూ. 905 కోట్లు..తండ్రికి మైంబ్ బ్లాంక్


అయితే.. వీటికి ఇంత భారీ ధర పలకడానికి ఇదొక్కటే కారణం కాదు. వీటికి మహిమలు ఉన్నాయనే భావనే ఈ స్థాయి పాపులారిటీ రావడానికి ప్రధాన కారణమని ప్రముఖ ఆక్షన్ సంస్థ సౌత్‌బీ హౌస్ పేర్కొంది. వీటి వల్ల దుష్ట శక్తులు దరిచేరవని, పారలౌకిక జ్ఞానం కూడా సిద్ధిస్తుందని ముఘల్ రాజకుటుంబీకులు నమ్మేవారు. తెల్ల లెన్స్ కలిగిన కళ్లద్దాలను హేలో ఆఫ్ లైట్‌గా..ఆకుపచ్చ రంగు లెన్స్ ఉన్నవాటిని గేట్‌ వే ఆఫ్ పారడైజ్‌గా పిలుస్తారు. వచ్చే నెలలో సౌత్‌బీ ఈ రెండు కళ్లజోళ్లను వేలం వేయనుంది. వీటి వేలం ద్వారా రూ. 25 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు సౌత్‌బీ హౌస్ అంచనా వేస్తోంది. ఇవి చాలా అరుదైనవని, ముఘల్ కాలంనాటి నైపుణ్యాలకు ఇవి ప్రతీకలని సౌత్‌బీ మధ్యప్రాచ్యం, ఇండియా విభాగం చైర్మన్ ఎడ్వర్డ్ గిబ్స్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-17T03:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising