ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజనాపురం అబ్బాయి.. అమెరికా అమ్మాయి

ABN, First Publish Date - 2021-01-08T07:58:03+05:30

ప్రేమకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించారు ఆ ప్రేమికులు. ఖండాతరాలు దాటిన తమ ప్రేమను మూడుముళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఖండాంతరాలు దాటిన ప్రేమ.. 
  • మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట
  • హిందూ సంప్రదాయ పద్ధతిలో కొత్తగూడెంలో పెళ్లి


కొత్తగూడెం సాంస్కృతికం, జనవరి 7: ప్రేమకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించారు ఆ ప్రేమికులు. ఖండాతరాలు దాటిన తమ ప్రేమను మూడుముళ్ల బంధంతో ఏకం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపం వేదికగా సుజాత నగర్‌ మండలం అంజనాపురం అబ్బాయి, అమెరికా అమ్మాయి వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఆచంట వెంకటమోహన్‌రావు, శ్రీలత దంపతుల కుమారుడు రాజీవ్‌ .. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.


ఈ క్రమంలో డేవిడ్‌ లావెర్‌, కారెల్‌ లావెర్‌ల ద్వితీయ పుత్రిక ఎలిజబెత్‌తో ప్రేమలో పడ్డారు. పెద్దల నుంచి వారి ప్రేమకు అంగీకారం లభించింది. భారత్‌కు వచ్చి పెళ్లి చేసుకునేందుకు కరోనా నిబంధనలు అడ్డురావడంతో సుమారు ఏడాది పాటు నిరీక్షించారు. ఎట్టకేలకు గత నెల 30న ఆ ప్రేమికులు అంజనాపురానికి చేరుకున్నారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో గురువారం సాయంత్రం బంధుమిత్రుల ఆశీస్సుల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.


Updated Date - 2021-01-08T07:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising