ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్ సంచలన నిర్ణయం.. ఈ మూడు చైనా బ్రాండ్ల అమ్మకాలపై నిషేధం..

ABN, First Publish Date - 2021-07-02T18:30:45+05:30

చైనాకు చెందిన మరో మూడు ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనాకు చెందిన మరో మూడు ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ షాకిచ్చింది. ఆ సంస్థలకు చెందిన ఉత్పత్తులను తన ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించింది. కస్టమర్లకు గిఫ్ట్​కార్డులు ఎరగా వేసి అమెజాన్‌లోని తమ ప్రొడక్టులకు ఫేక్​ రివ్యూలను రాయించుకుంటున్నట్టు తేలడంతో వాటిపై వేటు వేసింది. చైనాలోని సన్‌వ్యాలీ కంపెనీకి చెందిన RAVPower power banks, Taotronics earphones, VAVA cameras అమ్మకాలపై నిషేధం విధిస్తూ అమెజాన్ తాజాగా నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే చైనాకు చెందిన 16 బ్రాండ్లను ఇదే కారణంతో అమెజాన్ నిషేధించిన సంగతి తెలిసిందే. తాజా నిషేధంతో బ్యాన్​ అయిన చైనీస్ సంస్థల సంఖ్య 19కి చేరింది. వీటిలో బైట్ డ్యాన్స్‌కు చెందిన ఓ సంస్థ కూడా ఉండడం విశేషం.  


అమెజాన్‌లోని తమ ఉత్పత్తుల గురించి పాజిటివ్ రివ్యూలు రాస్తే గిఫ్ట్ కార్డులు ఇస్తామని చైనాకు చెందిన ఈ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో పెట్టాయి. ఈ విషయం అమెజాన్ యాజమాన్యం దృష్టికి రావడంతో వాటిని నిషేధించింది. రివ్యూ సిస్టమ్​ను అపహాస్యం చేసేలా ఆ సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేధాల కారణంగా చైనా సంస్థలకు చెందిన బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెజాన్ నుంచి దూరం అయిపోయాయి. 




Updated Date - 2021-07-02T18:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising