ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ వీడియో: రైలు కిందపడకుండా కాపాడి.. చెంప ఛెళ్లుమనిపించి..

ABN, First Publish Date - 2021-01-03T14:51:31+05:30

తృటిలో తప్పిపోయిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని దహిసార్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తృటిలో తప్పిపోయిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని దహిసార్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న విషయం మరిచి రైలు పట్టాలపై దిగిన ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వెంటనే స్పందించిన అతడిని హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. మరి కొద్ది సెకన్లలో రైలు ఢీకొంటుందనగా ఆ వ్యక్తి ప్లాట్‌ఫాంపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నాడు. సదరు వ్యక్తి పేరు గన్‌పత్ సోలంకీ అని రైల్వే పోలీసులు సీసీటీపీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. వంతెనని వాడకుండా..నేరుగా పట్టాలను దాటి ప్లాట్‌ఫాం మారేందుకు సోలంకీ ప్రయత్నించాడు. 


ఈ క్రమంలో అతడు పట్టాల మధ్య ఉన్న బ్యారికేడు దాడుతుండగా అతడు ధరించి బూటు జారి పోతుంది. దాన్ని మళ్లీ తొడుక్కుని ప్లాట్‌ఫాం పైకి సోలంకీ వస్తుండగా..అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఎస్‌బీ నికమ్ రైలు రావడాన్ని గుర్తించాడు. ఆయన వెంటనే సోలంకీని అప్రమత్తం చేసి..పట్టాలు దాటేలా సహాయం చేశారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. అయితే..ఈ క్రమంలో తీవ్ర ఉత్కంఠకు లోనైన కానిస్టేబుల్..సోలంకీ సురక్షితంగా ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న వెంటనే అతడి చెంప ఛెళ్లుమనిపించారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసు చేయి చేసుకోవడం తప్పని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే..మరి కొందరు మాత్రం సోలంకీకి తిక్కకుదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



Updated Date - 2021-01-03T14:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising