ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల యాచకుల్ని ఆ టీచర్లు ఏం చేస్తున్నారంటే...

ABN, First Publish Date - 2021-11-06T17:18:50+05:30

బాల యాచకులకు విద్యాబుద్దులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజ్మీర్ (రాజస్థాన్): బాల యాచకులకు విద్యాబుద్దులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు. అజ్మీర్ నగరంలోని ప్రైవేటు పాఠశాలలో గణితం బోధించే టీచర్ సునీల్ జోషి వీధుల్లో యాచించే 50 మంది పేద పిల్లల్ని చేరదీసి వారికి అన్నం పెట్టడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వీధుల్లో యాచించే 50 మంది పిల్లల్ని దత్తత తీసుకున్న టీచర్ జోషి వారిని కాయర్, పంచీల్ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. మురికివాడల్లో నివశించే చిన్నారులను టీచర్ ఏర్పాటు చేసిన వ్యాన్లలో పాఠశాలకు తీసుకువస్తారు. 


బాల యాచకులైన పిల్లలకు పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. పాఠశాల పనివేళలు ముగిశాక పిల్లల్ని తన ఇంటికి తీసుకువచ్చి వారికి అదనంగా రెండు గంటల పాటు పాఠాలు బోధిస్తారు. అనంతరం వారికి తన ఇంట్లోనే భోజనం పెట్టి వాళ్లను ఇళ్లలో వదిలివేస్తారు. ఉదయం టిఫిన్ తో పాటు ఆ పిల్లలకు దుస్తులు కూడా ఆ టీచరే తన జీతం డబ్బులతో సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుడు సునీల్ జోషి చేస్తున్న మంచి పనిని చూసిన మరో టీచర్ కూడా సహకారం అందిస్తున్నారు.


బాలలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారికి ఉచితంగా చికిత్స చేసేందుకు అజ్మీరులోని చిన్నపిల్లల వైద్యుడు అలోక్ గార్గ్ ముందుకు వచ్చారు. బాల యాచకులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సత్ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సునీల్ జోషిని పలువురు అభినందించారు. 


Updated Date - 2021-11-06T17:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising