ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 ఏళ్ల కుర్రాడు.. 6 నెలల క్రితం పెళ్లి.. బంగారం లాంటి భార్య దొరికిందని సంబరపడిన ఇతడి లైఫ్ ఎలా ముగిసిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-12-23T18:13:31+05:30

ఆ కుర్రాడు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. అందమైన భార్య దొరికిందని సంబరపడ్డాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాడు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. అందమైన భార్య దొరికిందని సంబరపడ్డాడు.. ఆమెతో జీవితం ఆనందంగా సాగుతుందని ఆశపడ్డాడు.. అయితే అతడి ఆశ నెరవేరలేదు.. పెళ్లైన ఆరు నెలలకే అతను మరణించాడు.. ప్రియుడితో కలిసి భార్యే అతడిని దారుణంగా హత్య చేసింది.. అనంతరం ఏమీ తెలియనట్టు నాటకం ఆడింది.. బీహార్‌లోని జాముయ్‌లో ఈ ఘటన జరిగింది. 


జాముయ్‌కు చెందిన బైక్ మెకానిక్ వికాస్ కుమార్ (22)కు 6 నెలల క్రితం కాజల్ కుమారితో వివాహమైంది. అప్పటికే ఆమెకు దిఘపర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో లవ్ ఎఫైర్ ఉంది. వివాహం తర్వాత కూడా కాజల్ దానిని కొనసాగించింది. ప్రియుడితో ఫోన్ ద్వారా గంటలు గంటలు మాట్లాడుతుండేది. దీంతో వికాస్‌కు భార్యపై అనుమానం కలిగింది. ఆమెను తరచుగా ప్రశ్నించేవాడు. దీంతో అసహనానికి గురైన కాజల్ భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. 


మంగళవారం సాయంత్రం కాజల్ ప్రియుడు వికాస్ దగ్గరకు వచ్చి బైక్ బాగు చేయాల్సిందిగా కోరాడు. వికాస్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తర్వాత వికాస్ తిరిగి రాలేదు. దీంతో గ్రామస్థులందరూ వికాస్ కోసం మంగళవారం రాత్రంతా వెతికారు. బుధవారం ఉదయం గ్రామ శివారులో అత్యంత భయంకరమైన స్థితిలో వికాస్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా కాజల్ పైనే అరోపణలు చేస్తున్నారు. వికాస్‌ను కాజల్, ఆమె ప్రియుడు చంపేశారని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు కాజల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2021-12-23T18:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising