ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరగంటలో అత్తారింట్లో ఉంటామనగా కారును ఆపమన్న కొత్త పెళ్లికూతురు.. కిందకు దిగి ఆమె ఇచ్చిన ట్విస్ట్‌తో వరుడికి మైండ్‌బ్లాక్..!

ABN, First Publish Date - 2021-12-16T18:36:44+05:30

ఆమెకు ఇటీవలె వివాహం జరిగింది.. భర్తతో కలిసి కారులో అత్తగారింటికి బయలుదేరింది.. మరో అరగంటలో ఇల్లు చేరతామనగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెకు ఇటీవలె వివాహం జరిగింది.. భర్తతో కలిసి కారులో అత్తగారింటికి బయలుదేరింది.. మరో అరగంటలో ఇల్లు చేరతామనగా రోడ్డు పక్కన కారు ఆపమంది.. అప్పటికే అక్కడ ఓ యువకుడు బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు.. ఆ బైక్ ఎక్కి ఆమె అతనితో పాటు వెళ్లిపోయింది.. నిర్ఘాంతపోయిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ జంటను పట్టుకున్నారు.. అప్పుడు పోలీసుల ఎదుట ఆమె చెప్పిన సమాధానం విని అందరూ నివ్వెరపోయారు.. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


సాత్నా జిల్లాలోని అహిర్గోన్ గ్రామానికి చెందిన యువతికి బాందా గ్రామానికి చెందిన వరుడితో గత సోమవారం వివాహం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం అత్తారింటికి వెళ్లేందుకు ఆ యువతి తన భర్తతో కలిసి కారులో బయలుదేరింది. బాందాకు మరో అర కిలోమీటరు దూరం ఉంటుందనగా ఆమె కారును ఆపమంది. కారు దిగి అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న తన ప్రేమికుడు అశోక్‌తో పాటు వెళ్లిపోయింది. నిర్ఘాంతపోయిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు గంటల్లో వారిద్దరినీ పట్టుకున్నారు.


ఇరువైపుల కుటుంబాల వారినీ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఆ యువతి తన అత్తింటికి, పుట్టింటికి వెళ్లేందుకు నిరాకరించింది. తాను అశోక్‌ను ప్రేమించానని, అతనితో వెళ్లిపోతానని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పింది. వారిద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులు కూడా వారి నిర్ణయానికి అడ్డు చెప్పలేకపోయారు. ఆమె తన వద్ద ఉన్న నగలను భర్తకు, తల్లికి ఇచ్చేసి ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది.  

Updated Date - 2021-12-16T18:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising