ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

677 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుత ముహూర్తం.. ఆ సమయంలో బంగారం కొంటే..

ABN, First Publish Date - 2021-10-25T21:27:08+05:30

బంగారు ఆభరణాలు, వాహనాలు, ల్యాండ్, ఇల్లు.. ఇలా ఏది కొనుగోలు చేయాలన్నా సాధారణంగా ఒకటి పదిసార్లు మంచి రోజు ఎప్పుడో చూసుకునే కొంటూ ఉంటారు. మంచి రోజు కొనడం వల్ల అంతా శుభమే జరుగుతుందనే నమ్మకంతోనే సాధారణంగా ఇలా చేస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలకు పుష్య నక్షత్రం చాలా ఫేమస్. చాలా మంది ఏవైనా ఆస్తులు లేదా నూతన వాహ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బంగారు ఆభరణాలు, వాహనాలు, ల్యాండ్, ఇల్లు.. ఇలా ఏది కొనుగోలు చేయాలన్నా సాధారణంగా ఒకటి పదిసార్లు మంచి రోజు ఎప్పుడో చూసుకునే కొంటూ ఉంటారు. మంచి రోజు కొనడం వల్ల అంతా శుభమే జరుగుతుందనే నమ్మకంతోనే సాధారణంగా ఇలా చేస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలకు పుష్య నక్షత్రం చాలా ఫేమస్. చాలా మంది ఏవైనా ఆస్తులు లేదా నూతన వాహనాలు, బంగారం వంటి విలువైన లోహాలు కొనుగోలు చేయాలన్నా పుష్య నక్షత్రం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. కాగా.. ప్రతి ఏడాదిలో ఒక రోజు పుష్య నక్షత్రం వస్తున్నప్పటికీ ఈ సంవత్సరం దీనికి ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. పవిత్రమైన సమయంలో నిర్వహించే పనులు ఎటువంటి ఆటంకాలకు గురికావని బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఏడాదిలో ఒకసారి వచ్చే పుష్య నక్షత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాగా.. ఈ ఏడాది దీపావళికి ముందు   అక్టోబర్ 28న వచ్చే పుష్య నక్షత్రం అనేక విధాలుగా చాలా శుభప్రదమైనదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అక్టోబర్ 28న గురువారం కావడం అదే రోజున పుష్య నక్షత్రం వస్తుండటం వల్ల ఆ రోజును మరింత శుభప్రదమైనదిగా పేర్కొంటున్నారు. అక్టోబర్ 28న పగలు, రాత్రి అంతా పుష్య నక్షత్రం ఉంటుందని.. ఆ రోజు గురువారం కావడంతో గురు పుష్య యోగం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఏర్పడ్డ అమృత సిద్ధి యోగం మరోసటి రోజు ఉదయం అంటే.. అక్టోబర్ 29 ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగుతుందని అంటున్నారు. అంతేకాకుండా 677 ఏళ్ల క్రితం అంటే 1344లో ఏర్పడ్డ గ్రహస్థితులే ఈ ఏడాది అక్టోబర్ 28న కూడా ఏర్పడనున్నాయని చెబుతున్నారు. 




677 ఏళ్ల తర్వాత అక్టోబర్ 28న వస్తున్న ఈ అద్భుత ముహూర్తం రోజు ఏయే కార్యాక్రమాలు చేయవచ్చు అనే వివరాలను పరిశీలిస్తే.. బృహస్పతి పసుసు వర్ణ వస్తువులు, లోహాల కారక గ్రహం అయినందువల్ల గురు పుష్యలో బంగారం కొనడం చాలా శుభప్రదం అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పుష్య నక్షత్రానికి అధిపతి శని. శని ఇనుము కారక గ్రహం. అందువల్ల కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయోచ్చని అంటున్నారు. ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం, ఇల్లు లేదా ప్లాట్‌లు, యంత్రాలు , బట్టలు లాంటివి కూడా చేయవచ్చు చెబుతున్నారు. 



Updated Date - 2021-10-25T21:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising