ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్వర్టర్ అమ్మేందుకు ఫేస్‌బుక్‌లో ఫొటో.. దానిని చూసి నిర్ఘాంతపోయిన పోలీసులు.. అదేంటో మీరూ కనిపెట్టండి చూద్దాం..

ABN, First Publish Date - 2021-10-06T14:11:20+05:30

ప్రస్తుతం ఇంట్లోని సెకెండ్‌హ్యాండ్ వస్తువులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఇంట్లోని సెకెండ్‌హ్యాండ్ వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయా వస్తువుల ఫొటోలను ఉంచి, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని సందర్భాల్లో మోసాలు జరుగుతుండటంతో పాటు పొరపాట్లు కూడా చోటుచేసుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి తన ఇంటిలోని సామానును ఆన్‌లైన్‌లో విక్రయించే ఉత్సాహంలో చిక్కు్ల్లో పడ్డాడు. తన ఇంటిలోని సామాను విక్రయించేందుకు ఆ వ్యక్తి ఫేస్‌బుక్ వినియోగించాడు. తాను విక్రయించాలనుకుంటున్న వస్తువుకు సంబంధించిన ఫొటోను పోస్టు చేశాడు. 


అయితే ఈ సమయంలో జరిగిన పొరపాటు అతనిని జైలుకు వెళ్లేలా చేసింది. ఆ వ్యక్తి తాను విక్రయించాలనుకున్న వస్తువుకు సంబంధించిన ఫొటోలో మరో వస్తువు కూడా కనిపిస్తోంది. దీనిని పోలీసులు గమనించారు. అంతే వెంటనే అతని ఇంటికి వచ్చి, అతనిని అరెస్టు చేసి, తమతొపాటు తీసుకెళ్లారు. ఈ అనుభవం అమెరికాకు చెందిన జేమ్స్ కెర్ట్జ్‌కు ఎదురయ్యింది. అతను ఆన్‌లైన్‌లో క్యాటలాటిక్ కన్వర్టర్ విక్రయించాలనుకున్నాడు.


ఇందుకోసం ఆ వస్తువుకు ఫొటో తీసి ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటో కారణంగా ప్రస్తుతం ఆ వ్యక్తి జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. ఆ ఫొటోను చూసిన పోలీసులు ఆ ఫొటోలో మరొక వస్తువు ఉండటాన్ని కూడా గమనించారు. అంతే... వెంటనే అతని ఇంటిని వెతుక్కుంటూ పరుగుపరుగున వచ్చి అతనిని తీసుకెళ్లి జైలులో పడేశారు.  ఆ ఫొటోను పరిశీలనగా గమనించిన పోలీసులకు దానిలో డ్రగ్స్ ప్యాకెట్ కనిపించింది. ఇదే అతని కొంపముంచింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-06T14:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising