ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఏ క్షణాన్నయినా చావును చూపించే ఐదు విషయాలు.. వీటికి దూరంగా ఉండటమే ఉత్తముల లక్షణం

ABN, First Publish Date - 2021-11-21T12:27:36+05:30

ఆచార్య చాణక్య తన రచనల ద్వారా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య తన రచనల ద్వారా మనుషులు సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు కొన్ని విధానాలు అందించారు. ఆ విధానాలను అవలంబిస్తే జీవితం సమస్యలు లేని విధంగా ముందుకు సాగిపోతుంది. ఇంతేకాకుండా చాణక్య నీతిలో.. మనిషి తనకు జీవితంలో హాని కలిగించే కొన్ని అలవాట్లను కూడా విడిచిపెట్టాలని సూచించారు. కొన్ని దురలవాట్లు జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో మనిషికి చెడుచేసే ఐదు విషయాలను తెలియజేశారు. వీటికి దూరంగా ఉండకపోతే అవి మనిషికి ఏ క్షణాన్నయినా చావును చూపిస్తాయని హెచ్చరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


నిప్పు: మంటలు ఎగసిపడటానికి ఎంతో సమయం పట్టదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు క్షణాల్లో అన్నింటినీ దగ్ధం చేస్తాయి. అందుకే అగ్నికి దూరంగా ఉండాలని, లేని పక్షంలో అది ఒక్క క్షణంలో మిమ్మల్ని మసి చేస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు. 

పాము: పాము విషం మనిషిని అతి తక్కువ సమయంలో చంపేస్తుంది. అందుకే పాము మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండండాలని, చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణాలను హరించి వేస్తుందని చాణక్య తెలిపారు. 

నీరు: నీటి లోతును తక్కువగా అంచనా వేసి, దానిలో దిగడం వలన ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే నదుల దగ్గరకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య సూచించారు.

హోదా కలిగిన వ్యక్తి: హోదా కలిగిన వ్యక్తి సాంగత్యంలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు, అయితే అతనితో లేదా అతని కుటుంబ సభ్యులతో శత్రుత్వం పెట్టుకుంటే ప్రాణహాని కలగవచ్చు. ఈ విషయంలో హోదా కలిగిన వ్యక్తి తన పరువు పోతుందనే భయంతో క్షమించవచ్చేమో కానీ అతని కుటుంబ సభ్యులు క్షమాపణలతో విడిచిపెట్టరని ఆచార్య చాణక్య తెలిపారు.

మూర్ఖుడు: తెలివితక్కువ వ్యక్తితో స్నేహం చేసినవారు తమ జీవితంలోని ప్రతి సందర్భంలో తమకు తామే హాని చేసుకుంటారు. మూర్ఖుడితో స్నేహం చేస్తే ఆ తరువాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. 



Updated Date - 2021-11-21T12:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising