ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలలు నిండని బాబును ఎదురుగా పెట్టుకుని గుడిలో ఓ జంట పెళ్లి.. అసలేం జరిగిందో తెలిసి నివ్వెరపోయిన బంధువులు..!

ABN, First Publish Date - 2021-10-28T00:13:44+05:30

తమిళనాడులోని కడలూరు విరుధచలం సమీపంలోని గ్రామానికి చెందిన వేల్‌మురుగన్(36) అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన సత్య(27) అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. సుమారు రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమికులంతా ఒకేలా ఉండరనే విషయం తెలిసిందే. కొందరు ప్రేమికులు పెద్దలను సైతం ఎదిరించి పెళ్లి వరకూ వెళ్తుంటారు. ఇంకొందరు ప్రేమిస్తున్నానంటూ నమ్మించి అవసరం తీర్చుకున్నాక వదిలేయడం చూస్తుంటాం. తమిళనాడులో ఓ ప్రియుడు.. నెలలు నిండని బాబు సమక్షంలో యువతికి తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న బంధువులంతా నివ్వెరపోయారు.. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని కడలూరు విరుధచలం సమీపంలోని గ్రామానికి చెందిన వేల్‌మురుగన్(36) అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన సత్య(27) అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. సుమారు రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వేల్‌మురుగన్.. యువతికి కడుపు చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే భయంతో అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు సూచించాడు. దీనికి ఒప్పుకోని యువతి.. కొన్నాళ్లు దూరంగా వెళ్లింది. పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. మగబిడ్డ జన్మించిన అనంతరం.. జనన ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు ఆస్పత్రి వారు భర్త పేరు అడిగారు. దీంతో విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించారు.


ఆస్పత్రికి చేరుకున్న మంగళం పోలీసులు యువతిని విచారించారు. అనంతరం వేల్‌మురగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు. అనంతరం వారిని గుడికి తీసుకెళ్లి బిడ్డ సమక్షంలోనే సత్యకు తాళి కట్టించారు. విషయం తెలుసుకున్న స్థానికులు నివ్వెరపోయారు. మొత్తానికి పెళ్లి చేసి మంచి, యువతికి న్యాయం చేశారని అభింనదించారు. తమ కుమార్తె జీవితం కుదుట పడిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-28T00:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising