ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ యాచకుడికి కొత్త కష్టం.. చేతిలో రూ.65 వేలు.. కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టలేడు.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2021-10-21T00:38:42+05:30

అతడికి సుమారు 65 ఏళ్ల వయసు ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొన్నేళ్లుగా యాచిస్తూనే జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కో రూపాయి పొదుపు చేసుకుని.. సుమారు రూ. 65వేలు దాచుకున్నాడు. ప్రస్తుతం కళ్లు సరిగా కనిపించకపోవడంతో.. అతడు యాచించడానికి వెళ్లలేకపోతున్నాడు. ఈ క్రమంలో తాను దాచుకున్న డబ్బును ఖర్చు చేసి.. మిగిలిన జీవితం గడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి సుమారు 65 ఏళ్ల వయసు ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొన్నేళ్లుగా యాచిస్తూనే జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కో రూపాయి పొదుపు చేసుకుని.. సుమారు రూ. 65వేలు దాచుకున్నాడు. ప్రస్తుతం  కళ్లు సరిగా కనిపించకపోవడంతో.. అతడు యాచించడానికి వెళ్లలేకపోతున్నాడు. ఈ క్రమంలో తాను దాచుకున్న డబ్బును ఖర్చు చేసి.. మిగిలిన జీవితం గడుపుదాం అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన దగ్గర ఉన్న డబ్బులో కనీసం ఒక్కరూపాయిని కూడా ఖర్చు పెట్టలేనని తెలుసుకుని ఆ వృద్ధుడు కంగుతిన్నాడు. కాగా.. అసలు కథేటంనే వివరాల్లోకి వెళితే.. 



తమిళనాడుకు చెందిన చిన్నక్కణ్ణు అనే వృద్ధుడికి ప్రస్తుతం 65ఏళ్లు. కొన్ని కారణాల వల్ల అతడు కొన్నేళ్లుగా భిక్షాటన చేస్తూనే జీవినం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో యాచిస్తూనే అతడు సుమారు రూ. 65వేలను దాచుకున్నాడు. అయితే వయసు మీద పడటమో లేక మరేదైనా కారణమో స్పష్టంగా తెలియదు కానీ.. కొన్నాళ్లుగా కళ్లు కనబడక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో భిక్షాటన చేయడం ఆయనకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాను దాచుకున్న డబ్బును ఖర్చు చేసే అవసరం అతడికి తాజాగా వచ్చింది. దాచుకున్న డబ్బుతో ఆహారపదార్థాలు కొనుగోలు చేద్దాం అనుకున్న అతడికి ఆదివారం రోజు షాకింగ్ విషయం తెలిసింది.


మోదీ ప్రభుత్వం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల తాను దాచుకున్న డబ్బు చెల్లదని తెలుసుకుని ఆ వృద్ధుడు కంగుతిన్నాడు. అనంతరం ఈ విషయం తనకు తెలియదనీ.. తన స్థానికుల వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల సూచనతో ఆ వృద్ధుడు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాడు. దీంతో స్పందించిన కలెక్టర్.. ఈ విషయాన్ని జిల్లా బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వృద్ధుడి వద్ద ఉన్న డబ్బును మార్చి ఇవ్వడానికి వీలుపడదని.. అతడికి నెల నెలా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారు. 




Updated Date - 2021-10-21T00:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising