ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి, తండ్రి తానే కావాలని ఈ ట్రాన్స్‌జెండర్ డాక్టర్ ఏం చేసిందో చూడండి

ABN, First Publish Date - 2021-02-16T21:14:01+05:30

తల్లి కావాలని ప్రతి స్త్రీ అనుకుంటుంది. అలాగే తండ్రి కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అయితే తల్లి, తండ్రి తానే కావాలని అనుకుంటే..? అహ్మదాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ ఇలాంటి ఆలోచనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: తల్లి కావాలని ప్రతి స్త్రీ అనుకుంటుంది. అలాగే తండ్రి కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అయితే తల్లి, తండ్రి తానే కావాలని అనుకుంటే..? అహ్మదాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ ఇలాంటి ఆలోచనే చేసింది. అందులో భాగంగానే తన వీర్యాన్ని భద్రపరిచింది. తరువాత అదే వీర్యంతో తానే తల్లి కూడా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. 25ఏళ్ల డాక్టర్ జెస్నూర్ డయారా.. గోద్రాలోని చిన్న గ్రామం పంచమహల్‌లో జన్మించింది. పుట్టినప్పుడు పురుష అంగాలతో జన్మించింది. కానీ వయసు వచ్చే కొద్దీ తనలో స్త్రీ లక్షణాలు పెరుగుతుండడంతో తానో ట్రాన్స్‌జెండర్ అని తెలిసొచ్చింది. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అయితే స్త్రీగా మారిన తరువాత తాను తల్లిని కావాలని అనుకుంది. అయితే అక్కడే ఓ ఆలోచన వచ్చింది. ఆ బిడ్డకు తండ్రి కూడా తానే కావాలని భావించింది. 


ఈ క్రమంలోనే తన వీర్యాన్ని భద్రపరిచేందుకు సిద్ధమైంది. ఆనంద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌లో తన వీర్యాన్ని క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచింది. తాను స్త్రీగా మారిన తరువాత ఈ వీర్యాన్ని వినియోగించి బిడ్డను కనాలని భావిస్తోంది. త్వరలో సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత, ఈ వీర్యంతో ఆమె తల్లి కానుంది. ఒకవేళ అదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టిస్తుంది. 


ఇదిలా ఉంటే డయారా ఇటీవలే రష్యాకు చెందిన వైద్య యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా గుజరాత్‌ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.


Updated Date - 2021-02-16T21:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising