ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ అంతే.. ప్రతి రెండున్నర రోజులకూ ఓ కొత్త సంవత్సరం..!

ABN, First Publish Date - 2021-04-18T00:42:09+05:30

ఖగోళం గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువ. అనంతమైన విశ్వంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు నిరంతరం తమ అన్వేషణ కొనసాగిస్తూ కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. కెనరీ ద్వాపంలో ఆస్ట్రోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా భూమిని పోలీన ఓ భారీ గ్రహాన్ని గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఖగోళం గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువ. అనంతమైన విశ్వంలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు నిరంతరం తమ అన్వేషణ కొనసాగిస్తూ కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. కెనరీ ద్వీప సముదాయంలోని ఆస్ట్రోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా భూమిని పోలీన ఓ భారీ గ్రహాన్ని గుర్తించారు. భూమి కంటే దాదాపు 3.5 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగిన ఈ గ్రహం పేరు జీజే740. భూమికి 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెడ్‌ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ ఇది పరిభ్రమిస్తోంది. భూమి కాలమానం ప్రకారం... జీజే 740 కేవలం 2.4 రోజుల్లోనే ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది! అంటే.. ఆ గ్రహంపై దాదాపు రెండున్నర రోజులకోసారి కొత్త సంవత్సరం వస్తుందన్న మాట. మానవుడికి నివాస యోగ్యమైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీజే 740 గురించి మానవాళికి తెలిసింది. అంతదూరంలో ఉన్న గ్రహంపై మానవుడు కాలు పెట్టడం ఇప్పుడప్పుడే సాధ్యపడకపోయనప్పటికీ  దీన్ని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూమి పుట్టుకకు సంబందించి అనేక రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Updated Date - 2021-04-18T00:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising