ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంటిబిడ్డంత కప్ప.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, First Publish Date - 2021-05-13T01:02:57+05:30

కప్ప పేరెత్తగానే చాలా మంది పెద్ద కేక పెట్టి పరుగందుకుంటారు. ఇంకొంతమంది దానిని వీపరీతంగా అసహ్యించుకుంటారు. అయితే ఇప్పటివరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోలొమాన్: కప్ప పేరెత్తగానే చాలా మంది పెద్ద కేక పెట్టి పరుగందుకుంటారు. ఇంకొంతమంది దానిని వీపరీతంగా అసహ్యించుకుంటారు. అయితే ఇప్పటివరకు మీకు తెలిసిన కప్ప ఎంత సైజ్ ఉంటుంది..? మహా అయితే కొన్ని అంగుళాలుంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే కప్ప ఏకంగా అడుగున్నర ఉంటుంది. అంటే మానవ శిశువు సైజన్నమాట. అంతేకాదు ఇది దాదాపు కిలోకు పైగా బరువుంది. అయితే భయపడకండి. ఇది మీకు దరిదాపుల్లో లేదు. ఈ కప్పను తాజాగా సోలమాన్ దీవుల్లో గుర్తించారు. ఆ దీవుల్లోని హొనియారా ప్రాంతపు శివార్లలో స్థానిక ప్రజలకు ఈ కప్ప దొరికింది. పందులను వేటాడేందుకు వెళ్లిన వారి కంట ఈ కప్ప పడడంతో వారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే దీనిని వెంటనే తీసుకొచ్చారు. దీనిని చూసిన గ్రామస్థులు కూడా షాక్ తిన్నారు. 




కాగా.. ఈ కప్ప సెరేటోబాట్రాచిడే కుటుంబానికి చెందిన కార్నుఫర్ గప్పీ ఫ్రాగ్ జాతికి చెందినదిగా తెలుస్తోంది. అయితే ఈ కప్ప స్థానికులకు ఎంతో ఇష్టమట. దీనిని అక్కడి గ్రామస్థుల్లో కొంతమంది ‘బుష్ చికెన్’ అని కూడా పిలుస్తారట. చికెన్ కన్నా ఇది రుచిగా ఉంటుందని, కానీ ఇది దొరకడం కష్టం కావడంతో అరుదుగానే దీనిని తింటుంటారట. కాగా.. ఈ సారి దొరికి కప్ప అప్పటికే చనిపోవడంతో దానిని తినేశారు.

Updated Date - 2021-05-13T01:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising