ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

256 ఏళ్ల జీవితం.. 24 మంది భార్యలు.. 500 మంది సంతానం..

ABN, First Publish Date - 2021-02-24T00:36:20+05:30

‘నిండు నూరేళ్లు జీవించు’ అంటూ పెద్దలు ఆశీర్వదించడం మనకు తెలుసు. కానీ నూరేళ్లు దాటిపోతే.. అది కూడా రెండు వందల ఏళ్లుపైగా జీవిస్తే.. ఇదంతా నిజమే. చైనాలోని ఓ వ్యక్తి ఏకంగా 250 ఏళ్లు పైగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘నిండు నూరేళ్లు జీవించు’ అంటూ పెద్దలు ఆశీర్వదించడం మనకు తెలుసు. కానీ నూరేళ్లు దాటిపోతే.. అది కూడా రెండు వందల ఏళ్లుపైగా జీవిస్తే.. ఇదంతా నిజమే. చైనాలోని ఓ వ్యక్తి ఏకంగా 250 ఏళ్లు పైగా జీవించాడట. నమ్మడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని కొన్ని ఆధారాలు కూడా దొరుకుతుండడం షాక్‌కు గురి చేస్తోంది. చైనాకు చెందిన లీ చిన్ యోన్ అనే వ్యక్తి ఏకంగా 256 ఏళ్లు బతికాడని, అతడు 1677లో జన్మించి, 1933 వరకు మరణించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలూ లేవు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం లీ చిన్ 1736లో పుట్టారు. అంటే ఆయన 197 ఏళ్లు జీవించాడని ఆ కథనం చెబుతోంది. వైద్య వృత్తిలో నిష్ణాతుడైన లీ హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడం, తాబేలులా కూర్చోవడం, కుక్కలా నిద్రపోవడం వల్లనే ఆయన అంతకాలం జీవించనట్లు కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది.


ఇదిలా ఉంటే భారత దేశానికి చెందిన త్రైలింగ స్వామి అనే భారతీయ స్వామీజీ కూడా ఏకంగా 280 ఏళ్లు జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. త్రైలింగ స్వామి ఎప్పుడు జన్మించారనే దానిపై అనేక వాదనలున్నాయి. ఆయన శిష్యులు కొందరు త్రైలింగస్వామి జీవితం గురించి పుస్తకాలు రాశారు. అందులో స్వామీజీ జన్మించిన తేదీ గురించి ఒక్కొక్కరు ఒక్కో ఏడాదిని పేర్కొన్నారు. శివరామ అనే శిష్యుడు రాసిన పుస్తకంలో.. త్రైలింగస్వామి 1529లో జన్మించారని చెప్పగా.. మరో శిష్యుడు ఆయన 1607లో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మరణించిన తేదీ మాత్రం 1887లో మరణించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 280 ఏళ్లన్నమాట. ఆయన 1737 నుంచి 1887 వరకు వారాణసిలో జీవించినట్లు తెలుస్తోంది. ఆయనను శివ స్వరూపంగా శిష్యులు భావించేవారు.

Updated Date - 2021-02-24T00:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising