ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు.. తన ఇంటి విలువ రూ.3.6కోట్లు.. ఎలా సాధ్యమైందో తెలుసా..

ABN, First Publish Date - 2021-12-24T02:30:07+05:30

పెద్దవారి వల్ల కూడా సాధ్యం కాని పనిని ఆరేళ్ల చిన్నారి చేసి చూపెట్టింది. ఇంత చిన్న వయసులో రూ.3.6కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొనిందంటే నమ్మశక్యం కాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి చేసుకుని, ఇల్లు చూసుకుని.. చల్లగ కాలం గడపాలోయ్.. అని ఓ సినీ కవి అన్నట్లుగా, చాలా మందికి ఇలాంటి కోరికే ఉంటుంది. పెళ్లి చేసుకుని, మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఆచరణలో మాత్రం చూపించలేరు. కేవలం కలలతో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతుంటారు. కేవలం కొందరు మాత్రమే చివరకు తాము అనుకున్నది సాధిస్తుంటారు. సంపాదన విషయంలో పెద్దవారి వల్ల కూడా సాధ్యం కాని పనిని.. ఆరేళ్ల చిన్నారి చేసి చూపెట్టింది. ఇంత చిన్న వయసులో రూ.3.6కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొనిందంటే నమ్మశక్యం కాదు. తన సోదరి, సోదరుడి సాయంతో కోట్లు కూడబెట్టిన ఆ చిన్నారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది..


ఆస్ట్రేలియాకి చెందిన క్యామ్ మెక్‌లెల్లన్ అనే వ్యక్తికి.. రూబీ(6), లూసి, గుస్ అనే కుమారుడు ఉన్నారు. మెక్‌లెల్లన్‌కు మొదటి నుంచీ ముందు జాగ్రత్త ఎక్కువ. దీంతో తాను 20ఏళ్ల నుంచే సంపాదించడం మొదలెట్టాడు. ఇతను ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు కావడంతో తన తెలివి తేటలతో మూడు, నాలుగు ఉద్యోగాలు చేస్తూ ఏడాదికి రూ.190 లక్షలను ఆర్జించడం విశేషం. ఇతడికి 50ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పని చేయడం ఇష్టం లేదట. అందుకే చిన్న వయసు నుంచే సంపాదించడం మొదలెట్టాడు. ఇదిలావుండగా.. తండ్రికి తాను ఏమాత్రం తగ్గను అన్నట్టుగా.. తన ఆరేళ్ల కూతురు రూబీ కూడా చిన్నతనం నుంచే డబ్బు సంపాదించడం మొదలెట్టింది.

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..


రూబీ తన సోదరుడు, సోదరి సాయంతో చిన్నప్పటి నుంచే ఇంటి పనులు చేయడం, పుస్తకాలను ప్యాక్ చేయడం తదితర పనులు చేయడం ద్వారా డబ్బు కూడబెడుతూ వస్తోందని తండ్రి తెలిపాడు. తాను పిల్లలకు చిన్నప్పటి నుంచే పలు సలహాలు ఇస్తూ వస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆ చిన్నారి సంపాదన రూ.3.6 కోట్లకు చేరుకోవడంతో ఇల్లు కొన్నారట. పదేళ్లలో ఈ ఇంటి విలువ రెట్టింపు అవుతుందని మెక్‌లెల్లన్ చెబుతున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.

ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..

Updated Date - 2021-12-24T02:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising