ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Panchayat Polls: కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి చిందులు.. అసలు విషయం తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2021-12-22T22:56:33+05:30

అతను పంచాయితీ ఎలక్షన్ల బరిలోకి దిగాడు.. పెద్ద కుటుంబం కావడంతో గెలుస్తానని ధీమాగా ఉన్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను పంచాయితీ ఎలక్షన్ల బరిలోకి దిగాడు.. గ్రామంలోని పెద్ద కుటుంబం కావడంతో గెలుస్తానని ధీమాగా ఉన్నాడు.. తన కుటుంబంలోనే 12 మంది ఉండడంతో మిగిలిన వారి మద్దతు పొందేందుకు ప్రయత్నించాడు.. తీరా కౌంటింగ్ రోజు చూస్తే అతనికి భారీ షాక్ తగిలింది.. అతనికి కేవలం ఒక ఓటే పడింది.. అదీ తను వేసుకున్నదే.. దీంతో అతను షాకయ్యాడు.. కౌంటింగ్ కేంద్రం వద్ద కుటుంబ సభ్యులపై చిందులు తొక్కాడు.. గుజరాత్‌లోని వాపి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


గుజరాత్‌లోని వాపి జిల్లాలోని చర్వాలా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచి పదవికి సంతోష్‌ హల్పాతి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడు. తన కుటుంబంలోనే 12 మంది సభ్యులు ఉండడంతో ఉత్సాహంగా రంగంలోకి దిగాడు. కౌంటింగ్ రోజు సంతోష్‌కు భారీ దెబ్బ తగిలింది. తనకు కేవలం ఒక్క ఓటే పడిందని తెలిసి సంతోష్ షాకయ్యాడు. కుటుంబ సభ్యులపై కౌంటింగ్ కేంద్రం వద్ద కోపంతో విరుచుకుపడ్డాడు. తను ఓడిపోయినందుకు బాధగా లేదని, తన కుటుంబ సభ్యులు కూడా తనకు మద్దతు ఇవ్వనందుకు బాధగా ఉందని చెప్పాడు. భార్య కూడా తనకు ఓటు వేయలేదని దీనంగా చెప్పాడు. 

Updated Date - 2021-12-22T22:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising