ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయస్కాంతాన్ని మింగిన మూడేళ్ల బాబు.. 11 రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్లు చెప్పారు కానీ..

ABN, First Publish Date - 2021-08-11T21:04:38+05:30

విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడేళ్ల బాబు ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అయస్కాంతాన్ని మింగేశాడు.. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆ చిన్నారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.. ఎక్స్-రే తీసి చూడగా కడుపులో అయస్కాంతం కనిపించింది.. 11 రోజుల తర్వాత ఆపరేషన్ చేసి అయస్కాంతాన్ని తీసేశారు.. గండం గడించింది అనుకుంటున్న సమయంలో డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు.. బాబు చనిపోయాడని తెలిపారు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు చెందిన సునీల్ తివారి కుమారుడు, మూడేళ్ల కబీర్ గత నెల 29న ఆడుకుంటూ అనుకోకుండా అయస్కాంతాన్ని మింగేశాడు. ఆ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆ చిన్నారిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఎక్స్-రే తీసి చూడగా కడుపులో అయస్కాంతం కనిపించింది. ఆపరేషన్ చేసి అయస్కాంతాన్ని తీయాలని వైద్యులు చెప్పారు. అయితే ఆ రోజు అనస్థీసియా నిపుణుడు లేకపోవడంతో తర్వాతి రోజు రమ్మని చెప్పారు. ఆ తర్వాత చిన్నారికి దగ్గు, జ్వరం రావడంతో అవి తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు. 


సోమవారం ఆ చిన్నారికి ఎండోస్కోపీ చేసి అయస్కాంతాన్ని బయటకు తీశారు. అరగంటలో స్పృహలోకి వస్తాడని చెప్పారు. చివరకు రెండు గంటల తర్వాత వచ్చి బాబు చనిపోయాడని చెప్పారు. షాకైన తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. చిన్నారికి ఇచ్చిన మత్తు డోస్ ఎక్కువ కావడంతోనే చనిపోయాడని తేలింది. దీంతో బాబు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు బాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  


Updated Date - 2021-08-11T21:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising