ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

126 అడుగుల లోతున్న బావిలో పడిన 8 ఏళ్ల బాలుడు.. క్షణం కూడా ఆలోచించకుండా కాపాడేందుకు దూకిన తండ్రి.. ఆ తర్వాత..

ABN, First Publish Date - 2021-10-22T21:00:14+05:30

ఎప్పటిలాగే ఇంటి పక్కనే ఉన్న 126 అడుగుల లోతున్న బావి వద్ద 8 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. బావి చుట్టూ ఉన్న గోడపై కూర్చుని కబుర్లు చెబుతుండగా.. ఆకస్మాత్తుగా ఆ చిన్నోడు అందులో పడిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ బాలుడి తండ్రి.. బావి దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. బావిలో పడ్డ కొడుకుని చూసి, క్షణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఇంటి పక్కనే ఉన్న 126 అడుగుల లోతున్న బావి వద్ద 8 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. బావి చుట్టూ ఉన్న గోడపై కూర్చుని కబుర్లు చెబుతుండగా.. ఆకస్మాత్తుగా ఆ చిన్నోడు అందులో పడిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ బాలుడి తండ్రి.. బావి దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. బావిలో పడ్డ కొడుకుని చూసి, క్షణం కూడా ఆలోచించకుండా అందులో దూకేశాడు. విషయం తెలిసి స్థానికులు కూడా పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. అనంతరం సుమారు గంటపాటు కష్టపడి తండ్రి కొడుకులను బావిలోంచి బయటకు తీశారు. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 



మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఓం ప్రకాశ్ కుశ్వాహా అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన చిన్న కుమారుడి పేరు సమర్థ్. అతడికి దాదాపు 8ఏళ్ల వయసు ఉంటుంది. సమర్థ్ రోజూ తన ఇంటి దగ్గర ఉన్న బావి వద్ద స్నేహితులతో ఆడుకునే వాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా బావిపై ఉన్న గోడలపై కూర్చుని ఆడుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా సమర్థ్.. 126 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. సమర్థ్ స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఓం ప్రకాశ్.. బావి వద్దకు పరిగెత్తుకొచ్చి, కుమారుడిని కాపాడేందుకు బావిలో దూకేశాడు. అప్పటికే విషయం తెలియడంతో పెద్ద మొత్తంలో బావి వద్దకు చేరుకున్న స్థానికులు.. తండ్రీకొడుకులను బావి నుంచి బయటకు తీశారు. 


అనంతరం తీవ్రంగా గాయపడ్డ సమర్థ్‌ను ఓం ప్రకాశ్ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ క్రమంలో సమర్థ్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ఓం ప్రకాశ్‌కు తెలిపారు. కాగా.. సమర్థ్ మృతితో ఆ గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బావిలో ఇప్పటి వరకూ చాలా మంది పడ్డారని.. అయితే ఇప్పటి వరకూ ఎవరూ చనిపోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. సమర్థ్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.




Updated Date - 2021-10-22T21:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising