ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది అడుగుల మొసలి.. భయంతో బెంబేలెత్తిపోయిన జనం.. కష్టపడి జేసీబీతో పట్టేసిన తర్వాత దాన్ని ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2021-11-07T00:48:42+05:30

ఉన్నట్టుండి ఎనిమిది అడుగుల మొసలి కంటపడటంతో గ్రామస్థులంతా షాకయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత మొసలి తమ గ్రామంలోకి వచ్చిదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ జేసీబీని కూడా అక్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉన్నట్టుండి ఎనిమిది అడుగుల మొసలి కంటపడటంతో గ్రామస్థులంతా షాకయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత మొసలి తమ గ్రామంలోకి వచ్చిదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ జేసీబీని కూడా అక్కడకు పిలిపించారు. అనంతరం ఆ మొసలిని జేసీబీతో పట్టేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని మణిఖేడ ఆనకట్ట నుంచి నీటిని వదలడంతో తాజాగా సింధ్ నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ఈ క్రమంలోనే భింద్ అనే గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. వరద నీటితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండగానే తాజాగా వారిని ఎనిమిది అడుగుల మొసలి వారిని భయాందోళనలకు గురి చేసింది. గ్రామంలో మొసలిని చూసిన ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం.. అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఖాళీ చేతులతో అక్కడకు వచ్చిన అధికారులు.. దాన్ని పట్టుకోలేమని చేతులెత్తేశారు.



చేసేదేమీ లేక ఆ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఓ జేసీబీని అక్కడకు రప్పించారు. జేసీబీ సహాయంతో మొసలిని పట్టుకునేందకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మొసలి కొద్దిసేపు హల్‌చల్ చేసింది. చివరకు ఎలాగోలా కష్టపడి జేసీబీ సహాయంతో దాన్ని బంధించారు. అనంతరం పక్కనే ఉన్న నదిలోకి ఆ మొసలిని నెట్టారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. నదిలోకి నీటిని వదలడం వల్ల మొసళ్లు బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 




Updated Date - 2021-11-07T00:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising