ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కింటి శునకంపై అత్యాచారం చేసిన 67 ఏళ్ల వృద్ధుడు

ABN, First Publish Date - 2021-10-04T00:29:05+05:30

నైతిక విలువలు ఎంతగా పతనమవుతున్నాయో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. చిన్నారులు, మహిళలుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నైతిక విలువలు ఎంతగా పతనమవుతున్నాయో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. చిన్నారులు, మహిళలుపై అత్యాచారాలు దారుణంగా పెరిగిపోతున్న వేళ హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 67 ఏళ్ల వృద్ధుడు ఒకరు పొరిగింటి పెంపుడు శనకంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వినడానికి దారుణంగా ఉన్న ఈ ఘటన స్థానిక సోహనా ప్రాంతంలో జరిగింది. శునకాన్ని తన ఇంట్లోకి తీసుకొచ్చిన వృద్ధుడు దానిపై అత్యాచారానికి పాల్పడుతూ చిక్కాడు. నిందితుడిని సురేశ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు. 


నిందితుడి పక్కింట్లో ఉండే ముకేశ్‌కు రెండు శునకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మగది కాగా, రెండోది ఆడది. గత నెల 28న అతడి ఆడ శునకం కనిపించకుండా పోయింది. దీంతో దాని కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి కుక్క అరుపులు వినిపించాయి. దీంతో అరుపులు వినిపించిన వైపు వెళ్లగా, సురేశ్ ఇంట్లోంచి ఆ అరుపులు వినిపిస్తున్నట్టు గుర్తించాడు. దీంతో నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించిన ముకేశ్ అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. సురేశ్ తన శునకంపై అత్యాచారానికి పాల్పడుతుండడంతో తొలుత షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని సాక్ష్యం కోసం ఆ దృశ్యాన్ని రికార్డు చేశాడు. 


విషయం బయటపడడంతో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. శునకంపై అత్యాచారం వార్తలు నిజం కాదని తేల్చి చెప్పాడు. అయితే, వీడియో చూపించడంతో కిక్కురుమనకుండా ఉండిపోయాడు. వీడియోను కనుక రికార్డు చేయకుండా ఉండి ఉంటే ఎవరూ తాను చెప్పేది నమ్మి ఉండేవారు కాదని పేర్కొన్నాడు.  ఆ తర్వాతి రోజు తన వద్ద ఉన్న సాక్ష్యాన్నిపోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. సురేశ్‌పై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-10-04T00:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising