ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగులపై ఊరేగుతూ ఒక్కటైన 59 జంటలు

ABN, First Publish Date - 2021-02-15T02:38:17+05:30

బొటానికల్ గార్డెన్‌లో జరిగిన ఈ సామూహిక వివాహాలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. మేళతాళాలు, డ్యాన్స్‌ల నడుమ ఊరేగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకాంక్: ప్రేమికుల దినోత్సవాన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 59 జంటలు ఏనుగులపై ఊరేగుతూ ఒక్కటయ్యాయి. బొటానికల్ గార్డెన్‌లో జరిగిన ఈ సామూహిక వివాహాలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. మేళతాళాలు, డ్యాన్స్‌ల నడుమ ఊరేగింపు మొదలు కాగా, స్థానిక అధికారులు కూడా ఏనుగులపైనే ఈ కార్యక్రమానికి హాజరై మ్యారేజ్ లైసెన్సులు అందించడం విశేషం. సామూహిక వివాహంలో ఒక్కటైన 26 ఏళ్ల పెళ్లికొడుకు పటిఫట్ పంథనాన్ మాట్లాడుతూ.. తాను ఏదో ఒక రోజు ఓ అసాధారణ కార్యక్రమంలో వివాహ లైసెన్స్‌పై సంతకం చేయాలని ప్లాన్ చేస్తూ వచ్చానని, అది ఈ రోజు నిజమైందంటూ 23 ఏళ్ల వధువు పక్కనుండగా ఆనందంగా చెప్పాడు. 


నిజానికి చోంబురి ప్రావిన్స్‌లోని నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్‌లో ఏటా జరిగే ‘ఏనుగు సవారీ’ పెళ్లిళ్లకు వందలాదిమంది పోటెత్తుతారు. అయితే, కరోనా కారణంగా ఈసారి ఆ సంఖ్య 59కి పడిపోయింది. నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్ అధ్యక్షుడు కాంపోన్ టాన్సాచా మాట్లాడుతూ తాము కఠినమైన ఆంక్షల విధిస్తుండడం కారణంగా సురక్షితమని భావిస్తుండడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే పార్క్‌కు వస్తున్నట్టు చెప్పారు.  

Updated Date - 2021-02-15T02:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising