ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూగజీవాలపై అకృత్యం... ఐదు కుక్కలు మృతి... అసలేం జరిగిందంటే...

ABN, First Publish Date - 2021-09-04T12:23:18+05:30

మధ్యప్రదేశ్‌లో ధార్మిక నగరంగా పేరొందిన ఉజ్జయినిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో ధార్మిక నగరంగా పేరొందిన ఉజ్జయినిలో కొన్ని మూగజీవాలు అకృత్యానికి గురైన ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. ఎవరో అజ్ఞాత వ్యక్తులు... రోడ్డుపై తిరుగుతున్న కుక్కల నోటిలో యాసిడ్ పోశారు. ఈ ఘటనలో ఐదు కుక్కలు మృతి చెందాయి. ఈ ఉదంతం దేవాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. 


సీఎస్పీ వందనా చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం నాగ్ఝిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మీనగర్‌వాసులు తమ కాలనీలో తిరిగే కుక్కల నోటిలో ఎవరో యాసిడ్ పోశారని, వాటి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఒక జంతు సంరక్షణ సంస్థ నిర్వాహకులు... గాయపడిన ఆ కుక్కలను పశువైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ ఐదు కుక్కలు మృతి చెందాయి. వాటిని ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఖననం చేశారు. కాగా ఆ అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని సీఎస్పీ వందనా చౌహాన్ తెలిపారు. 

Updated Date - 2021-09-04T12:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising