ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్ సీటు మహిళలకు రిజర్వ్... ఎట్టకేలకు పెళ్లిచేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి!

ABN, First Publish Date - 2021-04-01T01:55:07+05:30

గ్రామ సర్పంచ్ కావాలన్న కోరికతో పదేళ్ల పాటు విస్తృత సామాజిక సేవ చేసిన 45 ఏళ్ల ఓ వ్యక్తి... తీరా తన సీటు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాల్లియా: గ్రామ సర్పంచ్ కావాలన్న కోరికతో విస్తృత సామాజిక సేవ చేసిన 45 ఏళ్ల ఓ వ్యక్తి... తీరా తన సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఎట్టకేలకు వివాహం చేసుకున్న వైనమిది. యూపీలోని బాల్లియా జిల్లా కరణ్ చాప్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాతి సింగ్ అనే వ్యక్తి 2015 ఎన్నికల్లో పోటీ చేసి  రెండో స్థానంలో నిలిచాడు. ఈసారైనా సర్పంచ్‌గా గెలిచితీరాలని అతడు ఆశలు పెట్టుకున్నాడు. తీరా అతడి స్థానం ఈసారి మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీచేసే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఇప్పటికైనా పెళ్లిచేసుకుని భార్యను ఎన్నికల్లో నిలబెట్టాలంటూ హాతి సింగ్ అభిమానులు అతడికి సలహా ఇచ్చారు. అన్నట్టుగానే ఈ నెల 26న ఆయన తన గ్రామంలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు.


హిందువుల ఆచారం ప్రకారం ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోయినప్పటికీ హాతి సింగ్ హడావిడిగా పెళ్లి చేసుకోవడం మరో విశేషం. ‘‘ఏప్రిల్ 13లోపు నామినేషన్ వేయాల్సి ఉన్నందున నేను ఇప్పుడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది..’’ అతడు చెప్పుకొచ్చాడు. తన తల్లికి 80 ఏళ్లు దాటినందున ఆమెను పోటీ చేయించడం సాధ్యపడలేదని పేర్కొన్నాడు. ‘‘గత ఐదేళ్లుగా నేను విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నా మద్దతుదారులు కూడా నాకోసం బాగా ప్రచారం చేస్తున్నారు. కేవలం నా మద్దతుదారుల కోరిక మేరకే ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదన్న నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది..’’ అని సింగ్ పేర్కొన్నాడు. కాగా వివాహం చేసుకున్న మహిళ కూడా ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడం కొసమెరుపు!

Updated Date - 2021-04-01T01:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising