ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4వేళ ఏళ్లనాటి లడ్డూలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2021-03-28T01:49:27+05:30

హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూ వంటి తినుబండారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లడ్డూలవంటి పదార్థం బయపటడింది. అనేకరకాల ప్రొటీన్లతో నిండిన ధాన్యాలను వినియోగించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: హరప్పా నాగరికత కాలం నాటి లడ్డూ వంటి తినుబండారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో లడ్డూలవంటి పదార్థం బయపటడింది. అనేకరకాల ప్రొటీన్లతో నిండిన ధాన్యాలను వినియోగించి ఈ లడ్డూలను తయారు చేశారని, దీనిని బట్టి అప్పట్లో చాలా పోషకాహారాలు కలిగిన ఆహారం తీసుకున్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించాడు. లక్నోకు చెందిన బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, ఢిల్లీకి చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలు రెండూ కలిసి రాజస్థాన్‌లోని బిన్‌జోర్ ప్రాంతంలో ఉన్న హరప్పా నాగరికతకు సంబంధించిన ఆర్కియాలజికల్ సైట్‌లో చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నాయి. అయితే 2017లో వారికి ఓ 7 లడ్డూలవంటి పదార్థాలు భించాయి. వాటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు వీటిని అనేకరకాల ప్రొటీన్లు ఉన్న తినుబండారాలుగా గుర్తించారు.


పరిశోధనల అనంతరం ఈ లడ్డూలు దాదాపు 2600 బీసీఈ కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు చెప్పారు. వీటిని చాలా జాగ్రత్తగా నిల్వ చేశారని, అయితే ఇవి నీరు తగలడం వల్ల పర్పుల్(లేత వంకాయ రంగు’లోకి మారిపోయాయని వారు చెప్పారు. దీనికి సంబంధించిన శాంపిల్స్‌ను బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ అధికారులకు కూడా అందించినట్లు ఢిల్లీ సంస్థ వెల్లడించింది.

Updated Date - 2021-03-28T01:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising