ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్న భర్త.. పొలానికి వెళ్లిన భార్య రాత్రయినా రాలేదేంటని బంధువులకు డౌట్.. చెరకుతోటలో కనిపించిన సీన్ చూసి..

ABN, First Publish Date - 2021-10-24T11:56:07+05:30

రాత్రిపూట పొలంలో గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు ఆమెను వెతకడానకి వెళ్లారు. ఇంటి వద్ద ఆమెకోసం పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఎంత వెతికినా ఆమె తిరిగి రాలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రిపూట పొలంలో గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు ఆమెను వెతకడానకి వెళ్లారు. ఇంటి వద్ద ఆమెకోసం పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఎంత వెతికినా ఆమె తిరిగి రాలేదు. అసలు ఏం జరిగిదంటే..


బిహార్లోని ముజఫర్‌పూర్ సమీపంలో ఉన్న ఛవగ్రహియా గ్రామంలో అనోజ్ రామ్, ప్రతిమ దేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఉద్యోగరీత్యా అనోజ్ రాం కేరళకు వెళ్లగా ప్రతిమ దేవి(35) ఇంటివద్ద ఆవులను మేపుకొని, పొలం పని చూసుకొనేది. శుక్రవారం రాత్రి ఇంట్లోని పశువులకు మేతలేకపోవడంతో వాటికోసం గడ్డి తీసుకురావడానికి ప్రతిమ దేవి పొలానికి వెళ్లింది. ఇంటి ఆమె ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు.


అర్ధరాత్రి పిల్లల ఏడుపులకు పొరుగున ఉన్న వారి బంధువుల వచ్చారు. పిల్లలను వాళ్ల అమ్మ గురించి అడిగితే పొలం వెళ్లిందని చెప్పారు. ఇక వారికోసం ఆ గ్రామస్తులంతా వెతకడం ప్రారంభించారు. వారు ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. తెల్లవారుఝామున ప్రతిమ దేవి శవం ఒక చెరుకు తోటలో కనిపించింది. ఆమెను ఎవరో గొంతు నులిమి చంపారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమందించారు. ఆ గ్రామంలో గత 20 రోజులలో ఇది మూడవ హత్య కావడంతో.. గ్రామస్తులు పోలీసులు హంతకులని ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నించారు. ఇంతకుముందు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి, మరొక 15 సంవత్సరాల అబ్బాయి హత్యచేయబడ్డారు.


పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. హంతకులను త్వరగా పట్టుకొని, మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాగోలా వారికి నచ్చజెప్పారు.

Updated Date - 2021-10-24T11:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising