ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 వేల లీటర్ల మద్యం.. ఎలుకలు తాగేశాయి..

ABN, First Publish Date - 2021-03-10T01:03:17+05:30

ఆశ్చర్యపోయారు కదూ..! కానీ హరియాణా పోలీసులు చెబుతున్నది ఇదే.. పోలీస్ట్ స్టేషన్లలో భద్రపరిచిన మద్యాన్ని ఎలకలు స్వాహా చేసేశాయని వారు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ఆశ్చర్యపోయారు కదూ..! కానీ హరియాణా పోలీసులు చెబుతున్నది ఇదే.. పోలీస్ట్ స్టేషన్లలో భద్రపరిచిన మద్యాన్ని ఎలకలు స్వాహా చేసేశాయని వారు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల కాలంలో అక్కడి పోలీసులు.. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెయిడ్లు జరిపి అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 వేల లీటర్ల నాటు సారా, 30 వేల లీటర్ల మద్యం, 3 వేల క్యాన్ల బీర్‌‌ను జప్తు చేశారు. ఆ క్రమంలో వారు 825 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుండటంతో ఈ మద్యాన్ని వారు పోలీస్ స్టేషన్లలోని స్టోర్ రూమ్స్‌లో భద్రపరిచారు. ఇటీవల కోర్టు తీర్పు వెలువడటంతో ఆ మద్యాన్ని పారేశేందుకు వారు నిర్ణయించారు. ఈ క్రమంలో నిల్వ ఉంచిన మద్యంలో దాదాపు 29 వేల లీటర్లు కనిపించకుండా పోయినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. మరి ఆ మద్యం అంతా ఏమైపోయిందని పోలీసులను ప్రశ్నించగా.. ఎలుకలు తాగేశాయని వారు చెప్పుకొచ్చారట. దీంతో.. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రస్తుతం అక్కడ దర్యాప్తు ప్రారంభమైంది. 

Updated Date - 2021-03-10T01:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising