ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తతో 24ఏళ్ల మేనల్లుడు ప్రేమాయణం.. రాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా.. అతడు చేసిన పనికి తలలు పట్టుకున్న కుటుంబ సభ్యులు

ABN, First Publish Date - 2021-11-22T23:53:07+05:30

ఆ యువకుడికి 24ఏళ్లు. తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెతో చనువుగా మెలుగుతూనే ప్రేమలోకి దింపాడు. ఇతర కుటంబ సభ్యులకు ఎవ్వరికీ తెలియకుండా కొన్ని ప్రేమాయణం సాగించాడు. సరైన సమయం కోసం వేచి చూసి అం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడికి 24ఏళ్లు. తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెతో చనువుగా మెలుగుతూనే ప్రేమలోకి దింపాడు. ఇతర కుటంబ సభ్యులకు ఎవ్వరికీ తెలియకుండా కొన్ని ప్రేమాయణం సాగించాడు. సరైన సమయం కోసం వేచి చూసి అందరికీ షాకిచ్చాడు. అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే...

రాజస్థాన్‌లోని భరత్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం 20ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె తన పుట్టింటిని వదిలి.. అత్తారింట్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో వరుసకు మేనల్లుడయ్యే 24ఏళ్ల యువకుడు ఆమెపై కన్నేశాడు. చనువుగా ఉంటూనే ప్రేమలోకి దింపాడు. కొన్ని రోజులపాటు ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఈ నేపథ్యంలోనే సరైన సమయం కోసం వేచి చూసిన అతడు.. తాజాగా కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు.


ఈ నెల 16న అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా.. ఆ మహిళతో సహా ఇంట్లోంచి పారిపోయాడు. ఉదయం ఆ యువకుడు చేసిన పనిని గ్రహించిన కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. అయినా వారి జాడ తెలియలేదు. దీంతో చుట్టుపక్కల ఉన్న ఊళ్లలోనూ గాలించారు. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి, 24ఏళ్ల యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా.. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది.



Updated Date - 2021-11-22T23:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising