ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండిపై కూరగాయలమ్మిన ఈ భార్యాభర్తలిద్దరి ఒంటిపై ఇప్పుడు కిలోలకొద్దీ బంగారం.. చెప్పులు కూడా..

ABN, First Publish Date - 2021-07-08T20:33:25+05:30

`కష్టే ఫలి` అంటారు. కష్టపడితేనే జీవితంలో పైకి వస్తారంటారు. దానిని ఈ జంట నిజం చేసి చూపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`కష్టే ఫలి` అంటారు. కష్టపడితేనే జీవితంలో పైకి వస్తారంటారు. దానిని ఈ జంట నిజం చేసి చూపించింది. ఇరవయ్యేళ్ల క్రితం వీరిద్దరూ చిరు వ్యాపారులు. రోడ్డు పక్కన బండి పెట్టుకుని రకరకాల పళ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. కొన్ని రోజులకు పళ్ల సరఫరాదారులుగా ఎదిగారు. ఇప్పుడు ఒక్కక్కొరూ కిలోల కొద్దీ బంగారం ధరిస్తూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. వారే రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన కన్హయ్ లాల్, గీతా దేవి దంపతులు. 


ఇరవయ్యేళ్ల క్రితం కన్హయ్ లాల్ చిత్తోర్‌గఢ్‌లో రోడ్డు పక్కన బండి పెట్టుకుని ఆపిల్ పళ్లు, కూరగాయలు అమ్ముకునే వారు. అలా కష్టపడుతూ వ్యాపారంలో మెలుకువలు నేర్చుకుని చిత్తోర్‌గఢ్‌ ఆపిల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగారు. దాంతో అతని సంపాదన పెరిగింది. దాంతో తనకు ఎంతో ఇష్టమైన బంగారం కొనడంపై కన్హయ్ లాల్ దృష్టి సారించారు. అలా ఇప్పటివరకు దాదాపు ఆరు కేజీల బంగారం కొన్నారు. అతని ఒంటిపై ఎప్పుడూ మూడున్నర కేజీల బంగారం ఉంటుంది. నగలు మాత్రమే కాదు.. అతని మొబైల్, చెప్పులకు కూడా బంగారం ఉంటుంది. . 


కన్హయ్ లాల్‌ను అందరూ చిత్తోర్‌గఢ్‌ బప్పీలహరి అంటారు. ఒకసారి ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరిని కూడా కలిశారు. ఈయన ఒంటి మీద బంగారం చూసి బప్పీలహరి కూడా ఆశ్చర్యపోయారు. తనకే కాదు.. తన భార్యకు కూడా కన్హయ్ లాల్‌ మూడు కేజీల బంగారంతో వివిధ రకాల నగలు చేయించారు. అంతే కాదు.. ఈ బంగారాన్ని కాజేయడానికి ఎవరైనా వస్తారేమోనని భయంతో ఓ లైసెన్స్‌డ్ రివాల్వర్ కూడా తన ఇంట్లో ఉంచుకున్నారు. ఈయనతో ఫొటో దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు

Updated Date - 2021-07-08T20:33:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising