ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాస్ లీవ్ ఇవ్వలేదని కిడ్నాప్ డ్రామా... చివరికి...

ABN, First Publish Date - 2021-02-24T16:16:40+05:30

ఆఫీసులో సెలవు కోసం ఉద్యోగులు రకరకాల కారణాలు చూపుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరిజోనా: ఆఫీసులో సెలవు కోసం ఉద్యోగులు రకరకాల కారణాలు చూపుతుంటారు. అయితే అమెరికాలోని అరిజోనాకు చెందిన 19 ఏళ్ల ఒక ఫ్యాక్టరీ ఉద్యోగి పనికి వెళ్లకుండా ఉండేందుకు తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అరిజోనాలోని వాటర్ టవర్ సమీపంలోని ఒక టైర్ ఫ్యాక్టరీలో పనిచేసే బ్రాండన్ సోల్స్ తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాక్టరీకి కొద్ది దూరంలో సోల్స్ బందీగా పడివుండటాన్ని ఒక బాటసారి చూశాడు. 


ఆ సమయంలో సోల్స్ చేతులు బెల్ట్‌తో కట్టేసివున్నాయి. సోల్స్ అరవకుండా ఉండేందుకు నోటిలో ఏవో కుక్కేసివున్నాయి. దీనిని చూస్తే సోల్స్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని అనిపిస్తుంది. ఆ బాటసారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోల్స్‌ను విడిపించారు. పోలీసుల విచారణలో సోల్స్ తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపాడు. తనను వాహనంలో ఎక్కడికో తీసుకువెళ్లి, తిరిగి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారని తెలిపాడు. తన తండ్రి నగరంలో ఎక్కడో డబ్బులు దాచాడని వాటికోసం తనను కిడ్నాప్ చేశారని సోల్స్ చెప్పాడు. అయితే సోల్స్ పనిచేస్తున్న కంపెనీకి చెందిన అధికారులు విచారించగా అతను చెబుతున్నది అబద్ధమని తేలింది. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసుల సమక్షంలో సోల్స్ తాను కంపెనీలో లీవు కోసం కిడ్నాప్ డ్రామా ఆడానని తెలిపాడు. ఈ నేపధ్యంలో కంపెనీ సోల్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. 

Updated Date - 2021-02-24T16:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising