ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న ఆలోచనతో ఆ 15 ఏళ్ల కుర్రాడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే.. ఎవరైనా మెచ్చుకోవాల్సిందే!

ABN, First Publish Date - 2021-12-26T17:23:35+05:30

కరోనా కాలంలో చాలమంది ఉద్యోగాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కాలంలో చాలమంది ఉద్యోగాలు కోల్పోయారు. పరిశ్రమలతో పాటు వివిధ సంస్థలు మూతపడ్డాయి. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొందరు తమ సృజనాత్మకతతో కొత్త ఉపాధి మార్గాలు సృష్టించుకున్నారు. అటువంటివారిలో ఒకరే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్‌కు చెందిన అమర్ ప్రజాతి. 15 ఏళ్ల వయసుగల అమర్.. కోవిడ్ కాలంలో ఎల్ఈడీ బల్బులు, ల్యాంపులు తయారు చేసే స్టార్టప్ ప్రారంభించారు. ఇప్పుడు అమర్ 12 రకాలకుపైగా బల్బులను మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఐదు లక్షలకుపైగా బల్బులను అమర్ తయారు చేశాడు. మరో పదిమందికి ఉపాధి కల్పించాడు. రూ. 15 లక్షల రూపాయల మేర బిజినెస్ కూడా చేశాడు. 


9వ తరగతి చదువుతున్న అమర్‌కు చిన్నప్పటి నుంచి వినూత్న ఆవిష్కరణలు అంటే ఎంతో ఇష్టం. అమర్ తండ్రి గోరఖ్ పూర్ పారిశ్రామిక అభివృద్ధి అధారిటి(జీఐడీఏ)లో క్యాషియర్. తాను సాధించిన విజయం గురించి అమర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఎల్‌ఈడీ బల్బులకు డిమాండ్ పెరిగిందని, జనం రకరకాలు ఎల్ఈడీ బల్పులు వినియోగిస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలోనే తాను ఎల్ ఈడీ బల్బుల తయారీపై దృష్టి పెట్టానన్నారు. ఇందుకోసం ఇంటర్నెట్ సాయంతో పలు విషయాలు తెలుసుకున్నానన్నారు. ఆ తరువాత ఎల్ఈడీ బల్బుల తయారీలో శిక్షణ తీసుకునన్నానని, తన తండ్రి స్నేహితుని సాయంతో బల్బుల తయారీని ప్రారంభించానన్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ముడి సరుకు తీసుకువచ్చానన్నారు. 2020 నుంచి ప్రొఫెషనల్ లెవెల్‌లో ఎల్ఈడీ బల్బుల ఉత్పత్తి ప్రారంభించానన్నారు. ఇంటిలోని ఒక గదిని బల్పుల ఉత్పత్తికి వినియోగించామన్నారు. తమ స్టార్టప్‌కు జీవన్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో రిజిస్ట్రర్ చేయించామన్నారు. సంస్థను ప్రారంభించేందుకు రెండు లక్షల రూపాయలు వెచ్చించామన్నారు. ఇంటిలోనే బల్బులు తయారు చేసి మార్కెటింగ్ చేశామన్నారు.

Updated Date - 2021-12-26T17:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising