ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసాదం తిని స్పృహ తప్పి పడిపోయిన బాలిక.. ఎనిమిది నెలల పాటు ఇంటికి దూరం.. ఎలా తిరిగి వచ్చిందంటే..

ABN, First Publish Date - 2021-12-31T14:46:52+05:30

మొబైల్ రీచార్జ్ చేసుకునేందుకు ఆ బాలిక గ్రామంలోని షాప్‌నకు వెళ్లింది.. అక్కడ ఓ ఆగంతకుడు ఇచ్చిన ప్రసాదం నోట్లో వేసుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్ రీచార్జ్ చేసుకునేందుకు ఆ బాలిక గ్రామంలోని షాప్‌నకు వెళ్లింది.. అక్కడ ఓ ఆగంతకుడు ఇచ్చిన ప్రసాదం నోట్లో వేసుకుంది.. కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. కళ్లు తెరిచి చూసేసరికి బెంగళూరులో ఉంది.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఆమెకు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయం ఇచ్చింది.. ఎనిమిది నెలల అనంతరం ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.. ఆ ఎనిమిది నెలల్లో ఆ బాలిక హిందీ, కన్నడం మాట్లాడడం నేర్చేసుకుంది. 


రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్‌కు సమీపంలోని బరిసాద్రి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక 8 నెలల క్రితం అపహరణకు గురైంది. ఓ ఆగంతకుడు ఆమెను కిడ్నాప్ చేసి బెంగళూరులో వదిలేశాడు. దీంతో ఆమెకు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆశ్రయం ఇచ్చింది. బెంగళూరులోని వసతి గృహంలో ఉంచింది. ఆ బాలిక వివరాలు సేకరించి ఢిల్లీలోని సీడబ్ల్యూసీ ద్వారా రాజస్థాన్ సీడబ్ల్యూసీకి వివరాలు పంపించింది. అక్కణ్నుంచి తిరిగి సమాచారం వచ్చి బెంగళూరు నుంచి ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరే సరికి 8 నెలలు పట్టింది. 


గురువారం ఆ బాలిక తన స్వగ్రామానికి చేరుకుని తల్లిదండ్రులను కలుసుకుంది. బెంగళూరులో ఉన్న ఆ ఎనిమిది నెలల్లోనూ ఆ బాలిక హిందీ, కన్నడ భాషలు మాట్లాడడం నేర్చుకుంది. తాను పెద్ద చదువులు చదవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పింది. 

Updated Date - 2021-12-31T14:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising