ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌షీల్డ్ పెట్టుకుని వెయ్యిమంది మహిళల శివతాండవ స్త్రోత్ర పఠనం!

ABN, First Publish Date - 2021-03-09T12:34:06+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక నగరి వారణాసిలో మహిళలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వారణాసిలోసి అస్సీ ఘాట్ వద్ద వెయ్యిమందికిపైగా మహిళలు, యువతులు తమ చేతులలో దీపాలు పట్టుకుని, శివతాండవ స్త్రోత్రాన్ని పఠించారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఫేస్‌షీల్డ్ ధరించారు. అలాగే వారంతా ఎర్రరంగు చీర ధరించారు. మొత్తం 80 ఘాట్లలో నిలుచున్న మహిళలంతా ఒకేసారి శివతాండవ స్త్రోత్రాన్ని పారాయణం చేశారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినవారంతా మంత్రముగ్ధులయ్యారు. ముంబైకి చెందిన ఫౌండేషన్ ఆప్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Updated Date - 2021-03-09T12:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising