ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు చికెన్ పకోడీని లాగిస్తుంటారా?.. అయితే ఈ లక్ష రూపాయల ఉద్యోగం మీదే.. వెంటనే ఇలా దరఖాస్తు చేయండి!

ABN, First Publish Date - 2021-10-23T16:03:25+05:30

కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలను కోల్పోయారు. కొత్త ఉద్యోగాలను, ఉపాధులను వెతుక్కునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలామందికి ఉద్యోగాలు లభించడం లేదు. ఈ నేపధ్యంలో బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీ నిరుద్యోగులకు బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సదరు కంపెనీ చికెన్ డీపర్స్‌ను తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఇవి ఫ్రైడ్ చికెన్ నగెట్స్ మాదిరిగా ఉంటాయి. ఈ కంపెనీ తమ ఉత్పత్తుల రుచిని మరింత అద్భుతంగా తీర్చిదిద్ది మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వీటి రుచులను చూసేందుకు కొంతమందిని హయర్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. యూకేకి చెందిన ప్రముఖ ఫిష్ పింగర్ కంపెనీ బర్డ్స్‌ఐ ఇటీవల టేస్ట్ టేస్టర్‌ల భర్తీకి ప్రకటన ఇచ్చింది.


చికెన్ డీపర్స్‌ను పర్ఫెక్ట్‌గా టేస్ట్‌చేసే వారికి, తయారు చేసేవారికి ఆహ్వానం పలుకుతోంది. వినియోగదారులకు అత్యుత్తమ చికెన్ డీపర్స్‌ను అందించాలని కంపెనీ తాపత్రయపడుతోంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన డిటైల్స్ కూడా తెలియజేసింది. ఈ చీఫ్ డిప్పింగ్ ఆఫీసర్ పోస్టుకు లక్ష రూపాయల జీతం కూడా ఇస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే వ్యక్తికి రుచులను చూడటంలో అత్యధిక సామర్థ్యం కలిగివుండాలి. అలాగే వీరు.. డీపర్స్‌ క్రిస్పీగా ఉన్నాయోలేదో గమనించడంతోపాటు సాస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఉందో లేదో చూడగలగాలి. కాగా ఇటీవల జరిగిన ఒక సర్వేలో బ్రిటన్‌వాసులు చికెన్ డీపర్స్‌తో పాటు టమాటో సాస్‌ను ఫేవరెట్ ఫుడ్‌గా పేర్కొన్నారు. ఈ ఉద్యోగం కోసం మీరు కూడా దరఖాస్తు చేయాలనుకుంటే birdseyeHR@chiefdippingofficer.co.uk మొయిల్‌కు 250 పదాలతో కూడిన అభ్యర్థన చేసుకోవచ్చు. దానిలో ఈ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేస్తున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-10-23T16:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising