ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభంలో ప్రపంచ దేశాలు.. వృద్ధిబాటలో మనకే సానుకూలత: జిన్‌పింగ్‌

ABN, First Publish Date - 2021-01-13T14:46:14+05:30

ప్రపంచమంతా అనూహ్యమైన సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత దశలో... చైనా వేగవంతంగా వృద్ధిరేటును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, జనవరి 12: ప్రపంచమంతా అనూహ్యమైన సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్న  ప్రస్తుత దశలో... చైనా వేగవంతంగా వృద్ధిరేటును సాధించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. వచ్చే 30 ఏళ్లల్లో చైనా ఒక దేశంగా మహత్తరమైనరీతిలో వృద్ధిని సాధిం చే లక్ష్యంగా ఆయన తన దార్శనికతను ఆవిష్కరించారు. సోమవారం ఇక్కడ జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.


2012లో చైనా అధ్యక్షుడైన జిన్‌పింగ్‌...మావో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తిమంతుడైన నేతగా ఆవిర్భవించారు. కమ్యూనిస్టు పార్టీ కేడర్‌కు ఉత్తేజం కలిగించేరీతిలో ఆయన ప్రసంగం సాగింది. కొవిడ్‌-19 మహమ్మారి, సరుకుల సరఫరాలో ఇ బ్బందులు, నెమ్మదిస్తున్న వృద్ధిరేటు, పాశ్చాత్య దేశాలతో క్షీణిస్తున్న సంబంధాలు వంటి సవాళ్లు ఎదురవుతున్నా.... వృద్ధి సాధించేందుకు ప్రస్తుత కాలమాన పరిస్థితులు తమకే అనువుగా ఉన్నాయని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు.


‘‘గత వందేళ్లుగా ప్రపంచ దేశాలు సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మన కు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడే మనం పట్టుదలతో, పూర్తి విశ్వాసంతో, మొ క్కవోని దీక్షాదక్షతలతో ముందుకుసాగాలి.’’ అని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. 14వ పంచవర్ష ప్రణాళికలో నూతన అభివృద్ధి నమూనాను అమలుచేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2021-01-13T14:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising