ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిని పెంచుతూ..దాని బోనులో ఇరుక్కుని చివరికి దారుణంగా..

ABN, First Publish Date - 2021-10-12T00:28:17+05:30

పక్షుల పెంపకంలో ఆరి తేరిన ఓ వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు విడిచాడు. అత్యంత ప్రమాదకరమైన పక్షిని పెంచుతూ చివరికి దాని బారినేపడి అసువులు బాసాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పక్షుల పెంపకంలో ఆరితేరిన ఓ వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు విడిచాడు. అత్యంత ప్రమాదకరమైన పక్షిని పెంచుతూ చివరికి దాని బారినేపడి అశువులు బాసాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో శుక్రవారం నాడు ఈ దారుణం జరిగింది. అలాచువా కౌంటీకి చెందిన మార్విన్ హాజోస్(75) బ్రీడర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన పక్షులను పెంచుతుంటారు. సదరన్ కాసొవేరీ అనే పెద్ద పక్షి కూడా ఆయన వద్ద ఉంది. సగటున 58 కేజీల బరువు, 6.5 అడుగుల ఎత్తు ఉండే ఈ పక్షి చూడటానికి చాలా భారీగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా ఇది పేరుగాంచింది. 


అయితే.. శుక్రవారం నాడు అక్కడి పోలీసులు ఆ పక్షి బోనులో  పడి ఉన్న మార్విన్ మృత దేహాన్ని గుర్తించారు. మొదట తమకు ఆయన నుంచి ఓ ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చిందని, విషయం తెలుసుకునే లోపే కాల్ కట్టైందని వారు తెలిపారు. మరో వ్యక్తి నుంచి రెండో ఫోన్ కాల్ వచ్చాక తమకు అసలు విషయం తెలిసిందని పేర్కొన్నారు. పక్షి తన కాలి గోళ్లతో వృద్ధుడిని రక్కి హతమార్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఆయన పక్షి బోనులో చిక్కి ఉంటాడనే అంచనాకు వచ్చారు. 

Updated Date - 2021-10-12T00:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising